Crime News: మరికొద్ది రోజుల్లో పెళ్లి.. యువతిపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి కాబోయే భర్తకు పంపిన దుండగులు!
నమ్మి వెంట వచ్చిన పాపానికి ఓ యువతిని కామాంధులు చెరబట్టారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోయే ఓ యువతిపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
Woman molested in Mahbubnagar: నమ్మి వెంట వచ్చిన పాపానికి ఓ యువతిని కామాంధులు చెరబట్టారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోయే ఓ యువతిపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. తీయటి మాటలతో పరిచయం పెంచుకుని.. పని ఇప్పిస్తామని తీసుకువెళ్లి.. ఒంటరిగా వచ్చిన మహిళాను నిర్మానుష్య ప్రాంతంలో ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు సదరు అత్యాచారాన్ని వీడియో తీసి, ఆమె కాబోయే భర్తకు పంపించారు. బాధితురాలు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దినసరి కూలీగా పని చేస్తున్న ఆ యువతి(20) ప్రతి రోజు తమ గ్రామం నుంచి పట్టణానికి వచ్చి కూలీ పని చేసి సాయంత్రానికి తిరిగి వెళ్లేది. ఇదే క్రమంలో ఓ రోజు కూలీ పని దొరక్కపోవడంతో తిరిగి వెళుతున్న సందర్భంలో ఇద్దరు దుండగులు ఆమెను గమనించారు. పెయింటర్లుగా పని చేస్తున్న రాజేందర్ రెడ్డి, ఆంజనేయులు ఆ యువతికి మరో చోట పని ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నమ్మబలికారు. పని పేరుతో తమ ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు.
యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇద్దరు లైంగిక దాడికి పాల్పడుతూ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోలను ఆమెకు కాబోయే భర్తకు పంపారు. ఈ విషయాన్ని ఆ యువతి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం పోలీసులకు వివరించింది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
Read Also… Gas Cylinder: విద్యుత్ తీగకు గ్యాస్ సిలిండర్ తగిలి.. డెలివరీ బాయ్ దుర్మరణం..