Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nail Polish Side Effects: మీ పిల్లల చేతులకు నెయిల్ పాలిష్ వేస్తున్నారా ? అయితే జాగ్రత్త..

అమ్మాయిలు ఎక్కువగా ఉపయోగించే నెయిల్ పాలిష్ వినియోగిస్తుంటారు. ఆడవాళ్ల చేతులు.. కాళ్ల గోర్లను మరింత అందంగా కనిపించేలా

Nail Polish Side Effects: మీ పిల్లల చేతులకు నెయిల్ పాలిష్ వేస్తున్నారా ? అయితే జాగ్రత్త..
Nail Polish
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2021 | 8:41 AM

అమ్మాయిలు ఎక్కువగా ఉపయోగించే నెయిల్ పాలిష్ వినియోగిస్తుంటారు. ఆడవాళ్ల చేతులు.. కాళ్ల గోర్లను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది నెయిల్ పాలిష్.. అయితే మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా తమ చేతి వేళ్లకు.. కాళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటుంటారు. అయితే పెద్దవారు కూడా మరే ఆలోచన లేకుండానే పసిపిల్లల చేతులు.. కాళ్లకు నెయిల్ పాలిష్ వేస్తుంటారు. కానీ ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని గమనించరు. పిల్లల కాళ్లు, చేతి వేళ్లకు నెయిల్ పాలిష్ వేయడం వలన వారి ఆరోగ్యానికి మంచిదో.. కాదో తెలుసుకోండి..

సాధారణంగా నెయిల్ పాలిష్ తయారీలో ప్రమాదకరమైన రసాయానాలను ఉపయోగిస్తుంటారు. పిల్లలు తమ చేతులను ఎప్పుడు నోటిలో పెట్టుకుంటారు. దీంతో నెయిల్ పాలిష్ లోని రసాయనాలు వారి కడుపులోకి చేరిపోతాయి. దీంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అవెంటో తెలుసుకుందామా. 1. ఇందులోని హైడ్రోక్వినాన్ అనే రసాయం కంటికి తగిలితే కార్నియో దెబ్బతింటుంది. అంతేకాకుండా.. దీనిని పీల్చుకోవడం వలన ముక్కు, గొంతు, ఎగువ శ్యాసనాళంలో కూడా చికాకు ఏర్పడుతుంది. 2. నెయిల్ పాలిష్ లో ఉపయోగించే ఫార్మాల్డిహైడ్ రసాయనం మైలోయిడ్ లుకేమియాకు కారణమవుతుంది. ఇది ఎముక మజ్జ, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. 3. ఇందులో అక్రిలేట్స్ అనే రసాయనం కూడా ఉంటుంది. దీనిని పీల్చడం ద్వారా తాకిన చర్మంపై అనేక సమస్యలు కలుగుతాయి. మిథైల్ మెథాక్రిలేట్‌కు గురైన వారికి పేగులు… కడుపులో కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 4. కార్బన్ బ్లాక్ అనే పౌడర్ నెయిల్ పాలిష్ తయారీలో ఉపయోగిస్తారు. దీని వలన ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 5. నెయిల్ పాలిష్ రాసుకున్న తర్వాత త్వరగా ఆరిపోయే చేయాలని ఇందులో టొలుయెన్ అనే రసాయాన్ని ఉపయోగిస్తారు. ఎన్సీబీఐలో అందుబాటులో ఉన్న పరిశోధన ప్రకారం ఇది నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.

Also Read: Bellamkonda Ganesh : బెల్లంకొండ చిన్నబాబు కోసం బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. గణేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఎవంటే..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ రచ్చ.. సన్నీని రెచ్చగొట్టిన సిరి, షణ్ముఖ్..