Milk Benefits: మంచి నిద్రకు వేడిపాలు సహాయపడుతుందా? ఎందుకలా? పరిశోధకులు ఏమంటున్నారు? (వీడియో)
పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం అనేది మనలో చాలామందికి ఉండే అలవాటు. మన తల్లిదండ్రులు చిన్ననాటి నుండి రాత్రి భోజనం తర్వాత ‘పసుపు పాలు ‘ లేదా ‘బాదం పాలు’ తాగమని బలవంతం చేయడం మనకు తెలిసిందే.
పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం అనేది మనలో చాలామందికి ఉండే అలవాటు. మన తల్లిదండ్రులు చిన్ననాటి నుండి రాత్రి భోజనం తర్వాత ‘పసుపు పాలు ‘ లేదా ‘బాదం పాలు’ తాగమని బలవంతం చేయడం మనకు తెలిసిందే. వెచ్చని పాలు మనకు చక్కగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలా పాలు తాగితే మంచి నిద్ర ఎందుకు వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా?
అలా ఎందుకు అనే ప్రశ్నకు జవాబుగా కేసిన్ ట్రిప్టిక్ హైడ్రోలైజేట్ అని పిలువబడే మిల్క్ పెప్టైడ్‌ల మిశ్రమం ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను మరింత ప్రోత్సహిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతే కాదు. అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం శాస్త్రవేత్తలు సీటీహెచ్ లో కొన్ని నిర్దిష్ట పెప్టైడ్‌లను గుర్తించారు. నిద్రను పెంచే సిటీహెచ్ లోని ఇతర కారకాలను అన్వేషించాలని వారు సూచించినట్లు తెలుస్తోంది.వీటిని పరిగణనలోకి తీసుకుంటే, మన మనస్సు శరీరం రిలాక్స్ కావడానికి, గాఢ నిద్ర కోసం డిన్నర్ తరువాత వెచ్చని గ్లాసు పాలను తాగడం మంచిది అనిపిస్తోంది. కానీ డైట్ మార్చాలని అనుకున్నపుడు మన ఇంటి వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…