Ajwain for Uric Acid: ఇదొక్కటి తిన్నారంటే.. యూరిక్ యాసిడ్ మాయం కావడం ఖాయం!
ప్రస్తుత కాలంలో చాలా మంది బాధ పడే సమస్యల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే మూత్ర పిండాలపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ఇవి సరిగా పనిచేయకుండా ఉంటాయి. కిడ్నీల్లో నొప్పులు, స్టోన్స్‌కి దారి తీస్తుంది. కానీ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలను అయినా మన వంట గదిలో ఉండే మసాలా దినుసులు, పదార్థాలను తగ్గించుకోవచ్చు. పూర్వం వీటిని ఏక్కువగా ఉపయోగించేవారు. ఇంట్లో పెద్దలు ఉంటే..
ప్రస్తుత కాలంలో చాలా మంది బాధ పడే సమస్యల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే మూత్ర పిండాలపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ఇవి సరిగా పనిచేయకుండా ఉంటాయి. కిడ్నీల్లో నొప్పులు, స్టోన్స్‌కి దారి తీస్తుంది. కానీ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలను అయినా మన వంట గదిలో ఉండే మసాలా దినుసులు, పదార్థాలను తగ్గించుకోవచ్చు. పూర్వం వీటిని ఏక్కువగా ఉపయోగించేవారు. ఇంట్లో పెద్దలు ఉంటే ఇప్పటికీ వీటిని ఫాలో అవుతూనే ఉంటారు. వాము కూడా మన ఇంట్లో ఉంటుంది. వాముతో యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టవచ్చు. వాత, పిత్త, కఫ దోషాలను తగ్గించడంలో వామును ఎక్కువగా ఉపయోగించేవారు. వాముతో జలుబు, దగ్గును కూడా తగ్గించుకోవచ్చు. వాము తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇంతకు ముందు వామును అన్ని వంటల్లో వాడేవారు. కానీ ఈ మధ్య కాలంలో వామును ఎవరూ ఉపయోగించడం లేదు. కానీ వామును సరిగ్గా తీసుకుంటే చాలా సమస్యలను తగ్గించుకోవచ్చు. అదే విధంగా యూరిక్ యాసిడ్‌ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.
వాములో పోషకాలు:
వాములో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నికొటిన్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, లుటియోలిన్, బీటా సెల్లినిన్‌లు ఉంటాయి.
నమిలి తినండి:
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధ పడేవారు పరగడుపున వాము తీసుకోవడం చాలా మంచిది. యూరిక్ యాసిడ్ ఉన్నవారు ప్రతి రోజూ ఒక స్పూన్ వామును నోట్లో వేసుకుని నమిలి తింటూ ఉండాలి. ఆ తర్వాత నీటిని తాగండి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవుతుంది.
నీటిని తాగండి:
వాము ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం యూరిక్ యాసిడ్ మాత్రమే కాకుండా ఇతర సమస్యలను తగ్గించుకోవచ్చు. ఉదయం పరగడుపున నీటిలో వాము వేసి మరిగించిన నీటిని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా ప్రతిరోజూ తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మీకు మంచి ఫలితం ఉంటుంది.
నానబెట్టి తీసుకోవచ్చు:
వామును నీటిలో నానబెట్టి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పూట ఓ గ్లాస్ నీటిలో వాము వేసి నానబెట్టాలి. ఈ నీటిని ఉదయం వడకట్టి పరగడుపున తాగితే త్వరలోనే యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..