Jammi Chettu: జమ్మి చెట్టుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. అస్సలు ఊహించలేరు..

జమ్మి చెట్టు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులను బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. దేవతా వృక్షాల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి. చరిత్ర పరంగా కూడా జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. రాముడు లంకకు వెళ్లే ముందు ఈ మొక్కను పూజించాడు. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ఆయుధాలను ఈ వృక్షం దగ్గరే ఉంచారు. అందుకే విజయ దశమి రోజు విజయ..

Jammi Chettu: జమ్మి చెట్టుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. అస్సలు ఊహించలేరు..
Jammi Chettu
Follow us

|

Updated on: Oct 12, 2024 | 1:43 PM

జమ్మి చెట్టు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులను బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. దేవతా వృక్షాల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి. చరిత్ర పరంగా కూడా జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. రాముడు లంకకు వెళ్లే ముందు ఈ మొక్కను పూజించాడు. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ఆయుధాలను ఈ వృక్షం దగ్గరే ఉంచారు. అందుకే విజయ దశమి రోజు విజయ దశమి నాడు పూజిస్తే అపజయాలు కలగవని అంటూ ఉంటారు. అంతే కాకుండా ఆయుర్వేదం ప్రకారం కూడా.. ఈ చెట్టును పూజిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చెట్టు ఆకుల నుంచి కాండం వరకు కూడా అనేక పోషకాలు ఉన్నాయి. మరి ఈ చెట్టును ఆరోగ్యం కోసం ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

గొంతు నొప్పి:

శమీ వృక్షంతో కూడా గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ చెట్టు కాండాన్ని నీటిలో మరిగించి పుక్కిలిస్తే గొంతు నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే నోటి ఆరోగ్యం, పళ్ల సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. నోటి అల్సర్లు కూడా తగ్గుతాయి. ఈ చెట్టు కాండాన్ని ఎండబెట్టి పొడిలా చేసి కూడా ఉపయోగించవచ్చు.

చర్మ ఇన్ఫెక్షన్స్:

జమ్మి చెట్టు ఆకులతో చర్మ ఇన్ఫెక్షన్స్‌ కూడా తగ్గించుకోవచ్చు. చర్మం దద్దుర్లు, దురద, పొక్కులు, మంట వంటి చర్మ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకునేందుకు జమ్మి చెట్టు ఆకులు చక్కగా పని చేస్తాయి. ఈ ఆకులను ముద్దగా చేసి ఒంటికి రాసుకుంటే చాలు. లేదంటే గోరు వెచ్చటి నీటిలో వేసి ఓ అరగంట సేపు ఉంచి.. ఆ తర్వాత స్నానం చేస్తే చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

అవాంఛిత రోమాలు:

చాలా మందిలో అవాంఛిత రోమాలు వస్తూ ఉంటాయి. ఈ వెంట్రుకలను తొలగించడంలో జమ్మి చెట్టు చక్కగా పని చేస్తుంది. జమ్మి చెట్టు పండ్లు లేదా కాయలను నూరి రెగ్యులర్‌గా ముఖంపై రాసుకుంటే ఈ సమస్య కంట్రోల్ అవుతుంది.

గాలి శుద్ధి:

జమ్మి చెట్టును ఇంటి వద్ద లేదా ఇంటికి దగ్గరలో పెంచుకోవడం వల్ల చుట్టు ప్రక్కల గాలి అనేది శుద్ధి అవుతుంది. గాలిలో ఉండే హానికర కాలుష్యాలను గ్రహించి.. గాలిని శుద్ధి చేస్తుంది. ఈ మొక్కను ఇంటి బాల్కనీలోనూ పెంచుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

జమ్మి చెట్టుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. అస్సలు ఊహించలేరు..
జమ్మి చెట్టుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. అస్సలు ఊహించలేరు..
పాన్‌ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్‌.. ఆ మూవీస్ ఏంటి.?
పాన్‌ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్‌.. ఆ మూవీస్ ఏంటి.?
హెచ్చరిక.. కాఫీ, కూల్‌ డ్రింక్‌ అధికంగా తాగితే స్ట్రోక్‌ రిస్క్‌!
హెచ్చరిక.. కాఫీ, కూల్‌ డ్రింక్‌ అధికంగా తాగితే స్ట్రోక్‌ రిస్క్‌!
భాగామతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం..
భాగామతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం..
ఏ వయసుకి ఎంత బరువు ఉండాలో తెలుసా? ఒక్క రహస్యంతో సగం రోగాలు మటాష్
ఏ వయసుకి ఎంత బరువు ఉండాలో తెలుసా? ఒక్క రహస్యంతో సగం రోగాలు మటాష్
ఎందుకీ మౌనం..? గులాబీ దళపతి కేసీఆర్‌ స్ట్రాటజీ ఏంటి..
ఎందుకీ మౌనం..? గులాబీ దళపతి కేసీఆర్‌ స్ట్రాటజీ ఏంటి..
సహజంగా పింక్‌ కలర్‌ పెదాలు కావాలంటే.. రాత్రిళ్లు ఇలా చేయండి
సహజంగా పింక్‌ కలర్‌ పెదాలు కావాలంటే.. రాత్రిళ్లు ఇలా చేయండి
కనకం ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ హడావిడి.. డ్రామా బయట పడిపోయిందిగా!
కనకం ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ హడావిడి.. డ్రామా బయట పడిపోయిందిగా!
రవి నీచత్వం.. ఆ రాశుల వారికి కొన్ని రగాల అదృష్టాలు..!
రవి నీచత్వం.. ఆ రాశుల వారికి కొన్ని రగాల అదృష్టాలు..!
తులా రాశిలో బుధుడు.. ఆ రాశుల వారికి కెరీర్‌లో ఊహించని వృద్ధి..!
తులా రాశిలో బుధుడు.. ఆ రాశుల వారికి కెరీర్‌లో ఊహించని వృద్ధి..!