కృత్రిమ పండ్ల పానీయాలలో అదనపు చక్కెర, ప్రిజర్వేటివ్‌లు ఉన్నాయని ఈ పరిశోధనలో తేలింది. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా, స్ట్రోక్ ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఊబకాయం లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న మహిళల్లో స్ట్రోక్ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాఫీ లేదా టీని పూర్తిగా మానుకోలేకపోయినప్పటికీ.. ఈ అలవాటును తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ, హెర్బల్ టీలను తాగవచ్చు. ఇవి హానిచేయనివి. వీటిల్లో పాలకు బదులుగా, బాదం, సోయా లేదా ఓట్స్‌తో చేసిన పాలను తాగవచ్చు.