AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mouth Ulcer: నోటి పుండ్లతో ఏమీ తినలేక పోతున్నారా.. ఈ చిట్కాలతో దెబ్బకు మాయం అవుతాయి..

సాధారణంగా సీజనల్ వ్యాధుల్లో వచ్చే వాటిల్లో నోటి పుండ్ల సమస్య కూడా ఒకటి. నోటి పుండ్లు చిన్న వారిలో, పెద్ద వారిలో కూడా కనిపిస్తాయి. వీటినే మౌత్ అల్సర్లు.. నోటి పొక్కులు అని కూడా అంటారు. నోరు చాలా నొప్పిగా, మంటగా ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలని అనిపించదు. నీళ్లను కూడా తాగలేక పోతూ ఉంటారు. దీంతో నోటి పుండ్లు తగ్గడానికి మందులు వేసుకుంటూ ఉంటారు. కానీ మనం వీటిని ఇంటి చిట్కాలతో కూడా తగ్గించుకోవచ్చు. వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్..

Mouth Ulcer: నోటి పుండ్లతో ఏమీ తినలేక పోతున్నారా.. ఈ చిట్కాలతో దెబ్బకు మాయం అవుతాయి..
Mouth Ulcers
Chinni Enni
|

Updated on: Aug 28, 2024 | 1:35 PM

Share

సాధారణంగా సీజనల్ వ్యాధుల్లో వచ్చే వాటిల్లో నోటి పుండ్ల సమస్య కూడా ఒకటి. నోటి పుండ్లు చిన్న వారిలో, పెద్ద వారిలో కూడా కనిపిస్తాయి. వీటినే మౌత్ అల్సర్లు.. నోటి పొక్కులు అని కూడా అంటారు. నోరు చాలా నొప్పిగా, మంటగా ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలని అనిపించదు. నీళ్లను కూడా తాగలేక పోతూ ఉంటారు. దీంతో నోటి పుండ్లు తగ్గడానికి మందులు వేసుకుంటూ ఉంటారు. కానీ మనం వీటిని ఇంటి చిట్కాలతో కూడా తగ్గించుకోవచ్చు. వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. నేచురల్‌గా ఇంటి వద్దనే ఖర్చు చేయకుండా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ఈ నోటి పొక్కులు అనేవి అనేక కారణాల వల్ల వస్తాయి.

అలర్జీలు, హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్, జీర్ణాశయ ఇన్ ఫెక్షన్లు ఇలా అనేక కారణాల వల్ల మౌత్ అల్సర్లు అనేవి వస్తాయి. నోటిలోని లోపలి వైపు ఏర్పడతాయి. ఈ నోటి పుండ్ల కారణంగా జ్వరం కూడా వస్తుంది. సాధారణంగా ఇవి మూడు వారాల్లో తగ్గి పోతాయి. ఒక వేళ తగ్గకుంటే వైద్యుల్ని సంప్రదించాలి. ఈ నోటి పుండ్లను తగ్గించుకునేందుకు ఎలాంటి చిట్కాలు పని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి ఆకులు:

బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్స్ వల్ల కూడా ఈ నోటి పొక్కులు అనేవి వస్తాయి. ఈ పుండ్లు వచ్చినప్పుడు తులసి ఆకుల్ని శుభ్రంగా కడిగి నమిలి మింగాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల ఈ పొక్కులు పోతాయి. తులసి ఆకుల్లో ఎంతో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. తులసి నీటిని తాగుతూ ఉన్నా కంట్రోల్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

గసగసాలు:

గసగసాలతో కూడా మనం మౌత్ అల్సర్లను తగ్గించుకోవచ్చు. ఉదయాన్నే పరగడుపును ఒక స్పూన్ గసగసాలను ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే నోటి పుండ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కొబ్బరి నూనె:

నోటి పొక్కులను తగ్గించడంలో కొబ్బరి నూనె కూడా ఎంతో చక్కగా సహాయ పడుతుంది. నోటి పొక్కులు వచ్చినప్పుడు గంటకు ఒకసారి కొబ్బరి నూనె రాస్తూ ఉండండి. కొబ్బరి నూనెను ఓ పావుగంట సేపు పుక్కిలించినా తగ్గుతాయి.

పసుపు:

ఈ నోటి పుండ్లను తగ్గించడంలో పసుపు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసిందే. పొక్కులు ఉన్న చోట మూడు పూటలా పసుపును రాస్తూ ఉండండి. పసుపు నీళ్లను పుక్కిలించినా.. నోటి ఆరోగ్యం పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..