AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Grapes: ఎర్ర ద్రాక్ష మీరూ తింటున్నారా? వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల..

తాజా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. తాజా పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అటువంటి పోషకాలు ఉన్న పండ్లలో ద్రాక్ష ముఖ్యమైనది. అందులోనూ ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎర్ర ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరోపా దేశాల్లో ఎర్ర ద్రాక్ష ఎక్కువగా పండిస్తారు. వీటి నుంచి రెడ్ వైన్ తయారు చేస్తారు. కానీ మన దేశంలో ఎర్ర ద్రాక్ష చాలా తక్కువగా..

Red Grapes: ఎర్ర ద్రాక్ష మీరూ తింటున్నారా? వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల..
Red Grapes Health Benefits
Srilakshmi C
|

Updated on: Sep 13, 2023 | 9:04 PM

Share

తాజా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. తాజా పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అటువంటి పోషకాలు ఉన్న పండ్లలో ద్రాక్ష ముఖ్యమైనది. అందులోనూ ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎర్ర ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరోపా దేశాల్లో ఎర్ర ద్రాక్ష ఎక్కువగా పండిస్తారు. వీటి నుంచి రెడ్ వైన్ తయారు చేస్తారు. కానీ మన దేశంలో ఎర్ర ద్రాక్ష చాలా తక్కువగా మాత్రమే లభ్యమవుతాయి. ఎర్ర ద్రాక్షలోనో పోషకాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఒక కప్పు ఎర్ర ద్రాక్షలో 52 కేలరీలు, 1 గ్రాము ప్రోటీన్, 10 గ్రాముల కొవ్వు, 14 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1 గ్రాము ఫైబర్ ఉంటాయి. ఈ ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎర్ర ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు. ఎర్ర ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త నాళాలను సడలించడం, గుండె కండరాలలో ఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

మధుమేహం నియంత్రణ

ఎర్ర ద్రాక్షలో తగినంత మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఎర్ర ద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను పెంపును నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడంలోనూ కీలక పాత్ర

బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర ద్రాక్ష మేలు చేస్తుంది. ఎర్ర ద్రాక్షలో తగినంత ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా ఎక్కువ సేపు ఆకలి అనిపించకుండా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఎర్ర ద్రాక్షలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రెడ్ గ్రేప్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

మెరుగైన కంటి చూపు కోసం

ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎర్ర ద్రాక్షలో ఉండే ఫ్లేవనాయిడ్లు కంటి కణాలకు విశ్రాంతినిస్తాయి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!
బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!
బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!
తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో న
తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో న
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య
వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య