Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రాత్రి భోజనం తర్వాత ఈ తప్పులు మానుకోండి.. ఏం జరుగుతుందో తెలుసా..

అది మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. రాత్రి భోజనం చేసిన తర్వాత మనం నేరుగా పడుకుంటే.. కడుపులో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ ఆగిపోతుంది. మనం నిలబడి లేదా కూర్చున్నప్పుడు, గురుత్వాకర్షణ కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కానీ పడుకున్నప్పుడు.. ఈ ప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల ఆహారం జీర్ణం కాదు. ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

Health Tips: రాత్రి భోజనం తర్వాత ఈ తప్పులు మానుకోండి.. ఏం జరుగుతుందో తెలుసా..
Dinner
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 13, 2023 | 9:14 PM

రాత్రి భోజనం చేసిన వెంటనే చాలా మంది మనకు తెలియకుండా చేసే కొన్ని అలవాటులో పొరపాటు చేస్తుంటాం. అవి మన ఆరోగ్యానికి మంచివి కావు అని తెలిసినా తప్పు చేస్తుంటాం. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మన బరువు తగ్గడం కష్టతరం చేస్తాయి. రాత్రి భోజనం తర్వాత విశ్రాంతి, నిశ్చలతకు దూరంగా ఉండాలి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెంచుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత మనం చేయకూడని తప్పులు ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ తప్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం..

డిన్నర్ అయిన వెంటనే పడుకోవడం చాలా మంది చేసే సాధారణ చేసే పెద్ద తప్పు.. కానీ అది మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. రాత్రి భోజనం చేసిన తర్వాత మనం నేరుగా పడుకుంటే.. కడుపులో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ ఆగిపోతుంది. మనం నిలబడి లేదా కూర్చున్నప్పుడు, గురుత్వాకర్షణ కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కానీ పడుకున్నప్పుడు.. ఈ ప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల ఆహారం జీర్ణం కాదు. ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు నడవాలి లేదా కాసేపు కూర్చుని మాట్లాడాలి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సక్రమంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.

తాగే నీరు..

ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడి ఆహారం సరిగా జీర్ణం కాదు. రాత్రి భోజనం తర్వాత నీరు త్రాగడం అనేది జీర్ణక్రియకు సహాయపడటానికి ప్రజలు తరచుగా చేసే ఒక సాధారణ అపోహ, కానీ వాస్తవానికి ఇది మనకు ప్రయోజనకరం కాదు. రాత్రి భోజనం తర్వాత నీరు త్రాగడం కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. నీరు ఆహారాన్ని పలుచన చేస్తుంది. జీర్ణ రసాలతో కలపకుండా నిరోధిస్తుంది. అదనంగా, నీరు త్రాగటం కడుపు నింపుతుంది. ఆకలిని ఆలస్యం చేస్తుంది. ఇది అతిగా తినే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 1-2 గంటల తర్వాత మాత్రమే నీరు త్రాగాలి.

రాత్రి భోజనం తర్వాత పండ్లు తినడం..

చాలా మందికి సాధారణమైన అలవాటు, కానీ అది మన జీర్ణవ్యవస్థకు మంచిది కాదు. రాత్రి భోజనం తర్వాత పండ్లు తినడం కడుపులో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే పండ్లలో ఫైబర్, చక్కెర ఉంటాయి.. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. ఇది కాకుండా, పియర్, మామిడి మొదలైన కొన్ని పండ్లలో అధిక ఆమ్లత్వం ఉంటుంది.. ఇది అసిడిటీని కలిగిస్తుంది. పండ్లను రాత్రి భోజనానికి కనీసం 1-2 గంటల ముందు లేదా తర్వాత తీసుకోవాలి.

టీ లేదా కాఫీ తాగడం:

చాలా మందికి రాత్రి భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ అది మన జీర్ణవ్యవస్థకు మంచిది కాదు. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. అదనంగా, టీలో ఐరన్ శోషణను నిరోధించే టానిన్లు ఉంటాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం