Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Libya Flood Photos: 24 గంటల్లో లిబియా రూపురేఖలు మార్చేసిన తుఫాన్‌.. శాటిలైట్‌ పంపిన తాజా ఫొటోలు ఇవే..

స్టార్మ్ డేనియల్ తుఫాను లిబియాలో భీభత్సం సృష్టించింది. ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో సంభవించిన ఈ తుఫాను ఆ రాష్ట్ర రూపురేఖలను మార్చివేసింది. తూర్పు నగరమైన డెర్నాలో గడచిన 24 గంటల్లో 1500 మందికి పైగా మృత దేహాలు లభ్యమయ్యాయి. 5300 మందికి పైగా మరణించగా.. 10 వేల మందికి పైగా వదల్లో గల్లంతయ్యారు. ఈ తుఫాను వల్ల సంభవించిన భయంకరమైన వరద లిబియా రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. శాటిలైట్ పంపిన తాజా ఫొటోలు అక్కడి పరిస్థితిని అద్దం పడుతోంది..

Srilakshmi C

|

Updated on: Sep 13, 2023 | 7:28 PM

స్టార్మ్ డేనియల్ తుఫాను లిబియాలో భీభత్సం సృష్టించింది. ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో సంభవించిన ఈ తుఫాను ఆ రాష్ట్ర రూపురేఖలను మార్చివేసింది. తూర్పు నగరమైన డెర్నాలో గడచిన 24 గంటల్లో 1500 మందికి పైగా మృత దేహాలు లభ్యమయ్యాయి. 5300 మందికి పైగా మరణించగా.. 10 వేల మందికి పైగా వదల్లో గల్లంతయ్యారు. ఈ తుఫాను వల్ల సంభవించిన భయంకరమైన వరద లిబియా రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. శాటిలైట్ పంపిన తాజా ఫొటోలు అక్కడి పరిస్థితిని అద్దం పడుతోంది. నదుల ఆనకట్టలు తెగడంతో నీళ్లు నగరాలు, గ్రామాలను  ముంచెత్తాయి. డెర్నా నగరంలో 5 వేల మందికి పైగా మరణించిటన్లు అంచనా.

1 / 5
తూర్పు లిబియా మంత్రి మహ్మద్ అబు-లమౌషా మాట్లాడుతూ.. మధ్యధరా సముద్రంలో తలెత్తిన డేనియల్ తుఫాను ఇంతటి భీభత్సాన్ని సృష్టించింది. చాలా చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ మొత్తంలో నీళ్లు నగరంలోకి ప్రవేశించింది. ఆనకట్టలు తెగిపోయాయి. వంతెనలు విరిగిపోయాయి. ఇంత దారుణమైన విధ్వంసం ఇంతకు మునుపెన్నడూ సంభవించలేదన్నారు.

2 / 5
హరికేన్ డేనియల్‌ను మెడికేన్ అని కూడా పిలుస్తారు. లిబియాలో పరిపాలన యంత్రాంగం కూడా మరో కారణం. ఈ దేశాన్ని రెండు ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ఒకటి తూర్పు తీరం వైపు, మరొకటి పశ్చిమం వైపు. దీని కారణంగా లిబియాలో మౌలిక సదుపాయాలపై ఎవరూ శ్రద్ధ చూపడం లేదు. ప్రస్తుతం డెర్నాలో సహాయక చర్యలు చేపడుతున్నారు.

3 / 5
డెర్నా సముద్ర తీరం వెంబడి ఉన్న ఓ నగరం. ఈ నగరంలో సుమారు 89 వేల మంది నివసిస్తున్నారు. కానీ తుఫాను కారణంగా ఏర్పడిన సముద్రపు వరద, వర్షం కారణంగా హఠాత్తుగా రోడ్లు, వంతెనలు విరిగిపోయాయి. చాలా చోట్ల సామూహిక శ్మశానవాటికలు నిర్మిస్తున్నారు.

4 / 5
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ లిబియా రాయబారి తామెర్ రంజాన్ చెప్పారు. అనేక మంది ప్రజలు వరదల్లో గల్లంతయ్యారు. 10 వేల మందికిపైగా తప్పిపోయినట్లు తెలుస్తోంది. లిబియాలో ఇంతటి బలమైన తుఫాను గతంలో ఎన్నడూ సంభవించలేదు.

5 / 5
Follow us