AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rag Mayur : సినిమా బండి స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది.. రాగ్ మ‌యూర్‌

టాలీవుడ్‌లో వైవిధ్యమైన నటనతో దూసుకుపోతున్న యంగ్ తెలుగు యాక్టర్. 2021లో వచ్చిన 'సినిమా బండి' చిత్రంలో 'మరిడేశ్ బాబు' పాత్రతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందులో తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఐటీ ఉద్యోగం వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించిన రాగ్, సహజసిద్ధమైన తెలంగాణ యాసతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Rag Mayur : సినిమా బండి స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది.. రాగ్ మ‌యూర్‌
Rag Mayur
Rajitha Chanti
|

Updated on: May 17, 2026 | 2:45 PM

Share

ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రతిభావంతులైన నటుల్లో రాగ్ మ‌యూర్‌ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన..తన 2021 బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సినిమా బండి’ ఈ శుక్రవారం (మే 15)తో ఐదేళ్లు పూర్తి చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెల‌కు ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు. “న‌టుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మ‌రిడేశ్‌ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. సినిమా బండి సినిమా న‌టుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది” అని రాగ్ మ‌యూర్ తెలిపారు. ఈ సినిమా విజయం తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆయన ఈ సంద‌ర్భంగా వెల్లడించారు. రాగ్ మ‌యూర్‌కు సినిమా బండి మూవీ మంచి బ్రేక్‌నిచ్చింది. ఆ త‌ర్వాత ఆయ‌న వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌, కీడా కోలా, గాంధీతాతా చెట్టు వంటి చిత్రాల్లో న‌టించారు. ఈ చిత్రాలు ఆయ‌న్ని యువ‌త‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేశాయి. ప్ర‌ముఖ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయ‌త్‌’కు రీమేక్‌గా వ‌చ్చిన ‘సివ‌రాప‌ల్లి’ న‌టుడిగా మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ఆయ‌న ఓ ప్రాజెక్ట్‌ను మోయ‌గ‌ల‌ర‌ని నిరూపించింది.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

‘‘సివరాపల్లి’ సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వ‌చ్చింది. చాలా మంది ద‌ర్శ‌కులు న‌న్ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను రాశామ‌ని చెప్పారు. ద‌ర్శ‌కులు నాకోసం ప్ర‌త్యేకంగా పాత్ర‌లు రాయ‌టం అనేది న‌టుడిగా నాకు గొప్ప గుర్తింపు. నేను థియేట‌ర్ ఆర్టిస్ట్ కావ‌టంతో న‌ట‌న‌లో విభిన్న కోణాల‌ను అన్వేషించే అవ‌కాశం ద‌క్కింది. అది నా న‌ట‌న‌ను మ‌రింత మెరుగు ప‌రిచింది’’ అని రాగ్ మ‌యూర్ తెలిపారు. గతేడాది స‌మంత రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘శుభం’లో రాగ్ మయూర్ అతిథి పాత్రలో రాగ్ మయూర్ నటించారు. “అది చిన్న క్యామియో పాత్రే అయినా, ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో భాగమవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చిన సమంత గారికి కృతజ్ఞతలు,” అని ఆయన తెలిపారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ప‌ర‌దా’ చిత్రంలో రాజేష్ అనే పాత్ర‌లో రాగ్ మ‌యూర్ న‌టించి ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిత్ర మండ‌లి’లోనూ ఆయ‌న చెప్పిన ఇంగ్లీష్ వ‌న్ లైన‌ర్స్ కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

డైరెక్ట‌ర్ గౌరి నాయుడు జ‌మ్ము తెర‌కెక్కిస్తోన్న ‘గ‌రివిడి లక్ష్మి’లో రాగ్ మ‌యూర్ బుర్ర‌క‌థ క‌ళాకారుడిగా క‌నిపించ‌బోతున్నారు. “ఇది చాలా ఎక్సైటింగ్‌తో పాటు ఛాలెంజింగ్ పాత్ర కూడా. ఈ పాత్ర కోసం ఎంతో ప్రిపేర్ అయ్యి న‌టించాను” అని ఆయన తెలిపారు. తన ఫిల్మోగ్రఫీపై గర్వంగా ఉందని చెప్పిన రాగ్ మయూర్, “నా కెరీర్ ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి దర్శకులు, టెక్నీషియన్స్‌తో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను,” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Follow Us
విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
సినిమా బండి స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది.
సినిమా బండి స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది.
రవి ఆర్తిల కేసులో మరో హీరోయిన్ పేరు.. ఇచ్చిపడేసిన అత్త..
రవి ఆర్తిల కేసులో మరో హీరోయిన్ పేరు.. ఇచ్చిపడేసిన అత్త..
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
ఐపీఎల్ 2026 రద్దు చేయండి.. ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత సంచలన లేఖ
ఐపీఎల్ 2026 రద్దు చేయండి.. ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత సంచలన లేఖ
ఆ ఒక్క పొరపాటు.. ఏకంగా యువకుడి ప్రాణాలే తీసింది..
ఆ ఒక్క పొరపాటు.. ఏకంగా యువకుడి ప్రాణాలే తీసింది..
20 నిమిషాల్లో ఛార్జ్.. 683 కి.మీ రేంజ్.. రూ.2 లక్షల డిస్కౌంట్..!
20 నిమిషాల్లో ఛార్జ్.. 683 కి.మీ రేంజ్.. రూ.2 లక్షల డిస్కౌంట్..!
గంభీర్, అగార్కర్ స్కెచ్.. బలిపశువులా మారిన స్టార్ ప్లేయర్?
గంభీర్, అగార్కర్ స్కెచ్.. బలిపశువులా మారిన స్టార్ ప్లేయర్?
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ