Jayam Ravi Arthi: హీరో జయం రవి, ఆర్తిల కేసులో మరో ట్విస్ట్.. విడాకులకు కారణం ఆ హీరోయిన్.. ఇచ్చిపడేసిన అత్త..
ఇటీవల కాలంలో హీరోహీరోయిన్ల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా స్టార్స్ విడాకుల విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో విజయ్ దళపతి, సంగీత విషయాలు నెట్టింట హల్చల్ చేయగా.. ఇప్పుడు మరో హీరో పర్సనల్ విషయం తెరపైకి వచ్చింది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా డివోర్స్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికుడు. తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 2024 చివరి నాటికి తన భార్య ఆర్తి రవికి విడాకులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విడాకుల గురించి తనకు సమాచారం ఇవ్వలేదని ఆర్తి రవి కూడా ఆరోపించారు. వీరిద్దరి మధ్య విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా, ఇంకా విడాకులు మంజూరు కాలేదు. మరోవైపు జయం రవి గాయని కెనిషాతో కలిసి ఈవెంట్స్, ఆలయాలకు తిరగడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే తాను చెన్నై వదిలేసి వెళ్లిపోతున్నానని.. అలాగే జయం రవితో సైతం స్నేహాన్ని వదిలేస్తున్నానని కెనీషా వీడియో రిలీజ్ చేసింది. మరోవైపు శనివారం రవి సైతం విలేకరుల సమావేశం నిర్వహించి సంచలన విషయాలు బయటపెట్టారు. తన భార్యతో తనకు విడాకులు వచ్చేవరకు సినిమాల్లో నటించనని అన్నారు. అలాగే తన విడాకుల విషయంలో మరో నటిని గురించి ప్రస్తావించడంతో ఈ వివాదం అసలు మలుపులు తిరిగింది.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
తాజాగా ఆర్తి తల్లి సుజాత మీడియాతో మాట్లాడుతూ జయం రవి చేసిన ఆరోపణలను ఖండించారు. “రవి మోహన్ తన పిల్లలను నన్ను చూడనివ్వలేదన్నది పచ్చి అబద్ధం. ఎవరూ అలా చేయలేరు” అని అన్నారు. “పెళ్లి చేసుకోవడానికి రవి మోహన్‌ను బ్లాక్‌మెయిల్ చేశారన్న ఆరోపణ ఉంది” అని కూడా రిపోర్టర్ ప్రశ్నించగా అందుకు సుజాత స్పందిస్తూ.. “2008లో పెళ్లి ఒప్పందంపై ఎవరు సంతకం చేశారనే విషయాన్ని ఒక పత్రిక ప్రచురించింది. నేను ఆ విషయం కనుక్కొని నిరూపిస్తాను. అప్పుడు పెళ్లి కోసం ఎవరు మణికట్టుపై కోసుకుంటానని బ్లాక్ మెయిల్ చేశారనే విషయం సైతం ఉంది. సినిమాల్లో నటించనని చెప్పడం ఆయన ఇష్టం, ఇన్నేళ్ల తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకుంటే అది ఆయన నిర్ణయమే కానీ మాతో దానికి సంబంధం లేదు. నా వైద్య ఖర్చుల కోసం నెలకు రూ. 25,000 పంపానని ఆయన చెబుతున్నారు. కానీ అలా ఏం జరగలేదు” అంటూ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
రవి చెప్పినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అన్న ఓ విలేకరి ప్రశ్నకు సుజాత మాట్లాడుతూ.. “తమిళనాడులో ఏ మహిళకు అన్యాయం జరిగినా అందరూ మాట్లాడతారు. లక్షలాది మంది ఆర్తి పోస్టులకు కామెంట్లు పెట్టారు. కేవలం ఫలానా వ్యక్తులే ఆర్తి వెంట ఉండి ఇదంతా చేస్తున్నారనడం పూర్తిగా అబద్ధం. అతను అల్లుడిగా తన బాధ్యతను నిర్వర్తించాడు. మేము రెండేళ్లకు పైగా మాట్లాడుకోలేదు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు అండగా ఉంటారు, నేను నా కూతుళ్లకు అండగా ఉన్నాను. అంతేకాక, ఈ రెండేళ్లలో రవి మోహన్ వారి కుమారులను కేవలం రెండుసార్లు మాత్రమే చూశారు. విడాకుల విషయం మొదలై రెండేళ్లకు పైగా అయింది. అయినా మాకు అతనిపై ఇంకా మంచి నమ్మకం ఉంది. అతను ఇప్పటివరకు ఏ చెడు మాట మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మేము అతని గురించి చెడుగా ఏమీ చెప్పము ” అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
