AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో హలీం వండితే పండగే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే

జబర్దస్త్ కమెడియన్ రోలర్ రఘు గుర్తున్నాడా.? చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు రఘు. తనదైన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇస్తున్నాడు. అడపదడపా సినిమాల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆ స్టార్ హీరో హలీం వండితే పండగే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే
Raghu
Rajeev Rayala
|

Updated on: May 17, 2026 | 12:52 PM

Share

తన కామెడీతో ఎంతో మంది అభిమానులను నవ్వించాడు నటుడు రఘు. సినిమాలతో పాటు జబర్దస్త్ లోనూ స్కిట్స్ చేసి ప్రేక్షకులను నవ్వులు పూయించాడు రఘు. కాగా ఇటీవల రఘు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌తో తన స్నేహబంధం, వ్యక్తిగత అనుభవాలపై  మాట్లాడారు. వారి 25 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం 2002లో విడుదలైన ఆది సినిమాతో బలమైన పునాది వేసుకుందని రఘు వెల్లడించారు. ఈ బంధం ఇంత పటిష్టంగా ఏర్పడటానికి రాజీవ్ కనకాల ముఖ్య కారకుడని ఆయన వివరించారు. రాజీవ్ కనకాలే రఘును ఎన్టీఆర్‌కు పరిచయం చేశారని, మొదటి రోజు ఎన్టీఆర్ లేకుండా, తర్వాత రెండు, మూడు రోజులు ఆయనతో కలిసి భోజనం చేశామని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ గొప్పతనం వల్లే తన లాంటి వ్యక్తిని దగ్గరికి తీసుకున్నారని, ఇంట్లో భోజనం పెట్టి, ఎన్నో రాత్రులు కలిసి గడిపారని రఘు కారుమంచి అన్నారు.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

ఒక హీరో తన స్థాయికి దిగువన ఉన్నవారిని దగ్గరికి తీసుకోవడం వారి గొప్పదనమని, అయితే తమ ప్రవర్తన, వైఖరి కూడా సక్రమంగా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. తన 25 ఏళ్ల ప్రయాణంలో ఎన్టీఆర్‌తో తన బంధానికి ఎటువంటి మరక లేదని గర్వంగా తెలిపారు. ఎన్టీఆర్ వంట నైపుణ్యాలను రఘు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన ఏ రకమైన ఆహారాన్ని వండినా, దానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుందని అన్నారు. బిర్యానీ, హలీమ్‌తో సహా చైనీస్, మొఘలాయ్, ఆంధ్ర, ఇటాలియన్ వంటకాలను కూడా ఎన్టీఆర్ అద్భుతంగా చేస్తారని పేర్కొన్నారు. తమ గ్యాంగ్ ఆయన వంటలను బాగా ఆస్వాదిస్తుందని, “పాగాలు పాగాలు” తింటామని రఘు సరదాగా చెప్పారు. రఘు ఎన్టీఆర్‌ను “పెద్దన్న” అని, బాలకృష్ణను “బాబాయ్” అని సంబోధిస్తానని వెల్లడించారు. బయట ప్రపంచంలో “తారక్ పెద్దన్న” అని మాట్లాడితే అందరికీ అర్థం కాదని, కానీ ఆయనను “అన్న” అని పిలవడం ఒక గౌరవమైన పదమని భావిస్తానని తెలిపారు.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

ఎన్టీఆర్ స్నేహితుల బృందాన్ని “ఆర్-ఫోర్స్” అని రఘు కారుమంచి ప్రస్తావించారు. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు రామారావు, రాఘవ, రాజీవ్, రఘు, పెద్ది, సందీప్ వంటివారు ఉంటారని, అందరి పేర్లు ఆర్ తోనే మొదలవుతాయని చెప్పారు. ఈ టీమ్ ఒకప్పుడు టాటూలు వేయించుకోవాలని కూడా అనుకుందని రఘు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తన అవసరాలకు తగ్గట్టుగా తన శరీరాకృతిని మార్చుకోగల సామర్థ్యాన్ని రఘు కారుమంచి కొనియాడారు. బిందెలో నీళ్లు పోస్తే బిందెలా, గ్లాసులో పోస్తే గ్లాసులా మారినట్లు ఎన్టీఆర్ అవసరాన్ని బట్టి సన్నగా లేదా లావుగా మారతారని అన్నారు. గత ఆరు నెలలుగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ స్ఫూర్తిదాయకమని రఘు పేర్కొన్నారు రఘు చెప్పుకోచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

Ntr

Ntr

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us