AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంభీర్, అగార్కర్ స్కెచ్.. బలిపశువులా మారిన స్టార్ ప్లేయర్.. ఆఫ్ఘాన్‌తో టెస్ట్‌కు దూరం?

India vs Afghanistan Test 2026: భారత క్రికెట్‌లో ఇప్పుడు ఒకే ఒక చర్చ నడుస్తోంది. అఫ్గానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ త్వరలోనే సమావేశం కానుంది. అయితే, ఈ ఎంపికలో కొందరు సీనియర్లపై వేటు పడనుందనే వార్తలు ఇటు అభిమానుల్లో, అటు క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

గంభీర్, అగార్కర్ స్కెచ్.. బలిపశువులా మారిన స్టార్ ప్లేయర్.. ఆఫ్ఘాన్‌తో టెస్ట్‌కు దూరం?
Ind Vs Afg Test Series
Venkata Chari
|

Updated on: May 17, 2026 | 1:37 PM

Share

India vs Afghanistan Test 2026: సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలో ఎదురైన ఘోర పరాభవం తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. జూన్ 6 నుంచి 10 వరకు న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్, ఆ తర్వాత ధర్మశాల, లక్నో, చెన్నైలలో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. రాబోయే శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని టెస్ట్ జట్టులో పెద్దగా ప్రయోగాలు చేయకూడదని కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నప్పటికీ, ఒక కీలక సీనియర్ ఆటగాడిపై మాత్రం వేటు వేసేందుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: CSK vs SRH: చేపాక్‌లో ధోనీ చివరి మ్యాచ్‌పై వీడిన సస్పెన్స్..!

బలిపశువుగా అక్షర్ పటేల్? ఆ నిర్ణయం వెనుక అసలు కథ..

గత ఏడాది కాలంగా టెస్ట్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న సీనియర్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానానికి ఇప్పుడు పెద్ద ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యంగా రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత టెస్ట్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన రికార్డుగా నిలిచింది. ఈ ఘోర పరాభవానికి బాధ్యులను చేస్తూ సెలెక్టర్లు ఇప్పుడు అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించాలని చూస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు జట్టులో దాదాపు ఖాయం కావడంతో, అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూపేందుకు యాజమాన్యం సిద్ధంగా లేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో అక్షర్ పటేల్ 42 పరుగులు చేసి, రెండు వికెట్లు తీసినప్పటికీ సెలెక్టర్లను మెప్పించలేకపోయాడు. కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన వేళ, అక్షర్ బాధ్యతారాహిత్యంగా ఆడి వికెట్ పారేసుకోవడంపై గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ పరాభవానికి అక్షర్‌ను బలిపశువును చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కోహ్లీ, రోహిత్ కాదు.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యుత్తమ ప్లేయర్ అతడే: ధోనీ దోస్త్ సంచలన వ్యాఖ్యలు..!

బుమ్రా పనిభారంపై ప్రత్యేక నిఘా..

మరోవైపు, భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పనిభారం (వర్క్‌లోడ్) నిర్వహణపై మేనేజ్‌మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. సుదీర్ఘమైన ఐపీఎల్ సీజన్ ఆడి అలసిపోయిన బుమ్రాకు విశ్రాంతినివ్వడంపై చర్చలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం, బుమ్రా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్ లేదా వన్డే సిరీస్‌లలో ఏదో ఒకదానికే పరిమితం కానున్నాడు. ఒకవేళ టెస్ట్ ఆడితే వన్డేలకు విశ్రాంతి ఇస్తారు, లేదంటే వన్డే సిరీస్ ద్వారానే అతడు మైదానంలోకి వస్తాడు.

జట్టులోకి యువ రక్తం.. భవిష్యత్తుపై కన్ను..

2027 వన్డే ప్రపంచకప్, అలాగే రాబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును పునర్నిర్మించే పనిలో పడ్డారు గంభీర్, అగార్కర్ ద్వయం. అక్షర్ పటేల్‌కు పోటీగా దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న యువ స్పిన్నర్ మానవ్ సుతార్ పేరును సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. అలాగే, దేశవాళీ టోర్నీల్లో తన వేగంతో ఆకట్టుకున్న యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు తొలిసారి భారత జట్టు నుంచి పిలుపు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: IPL 2026: రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే.. మా టీంలో మెంటలోడిని తట్టుకోలేరంతే..!

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఈ మ్యాచ్ కేవలం ఒక ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే కాదు, టీమిండియా భవిష్యత్తు దిశను మార్చే ఒక కీలకమైన మలుపు. పాత పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని, కఠిన నిర్ణయాలతో జట్టును సరికొత్తగా తీర్చిదిద్దాలని చూస్తున్న గౌతమ్ గంభీర్ వ్యూహాలు ఎంతవరకు పారుతాయో, ఈ సెలెక్షన్ కమిటీ సమావేశం తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us