AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: కేంద్రం అదిరిపోయే సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..

కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్‌లు విద్యార్థులకు అందిస్తోంది. నెలకు రూ.15 వేల వరకు పొందవచ్చు. ఒక విద్యా సంవత్సరంలో రూ.1.50 లక్షలు పొందవచ్చు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్‌ మంజూరు చేస్తారు. రెండేళ్ల పాటు ఈ నగదు పొందవచ్చు. ఎలానో చూడండి.

Central Government: కేంద్రం అదిరిపోయే సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
Money
Venkatrao Lella
|

Updated on: Aug 15, 2026 | 10:27 AM

Share

విద్యార్థుల చదువులకు ఆర్ధిక భరోసా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పీజీ చదివే విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. రెగ్యులర్, ఫుల్ టైమ్ విధానంలో చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. రెండు సంవత్సరాల వరకు ఈ స్కాలర్ షిప్ అందిస్తారు. ఆన్‌లైన్‌లో ఈ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? దీనికి అర్హతలు ఏంటి..? స్కాలర్‌షిప్ ఎంతవరకు అందుతుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

యూజీసీ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్

నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆ సంస్థ ద్వారా యూజీసీ పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. నెలకు రూ.15 వేల చొప్పున అందుతుంది. 10 నెలల పాటు ఈ స్కాలర్ షిప్ అందిస్తారు. ఒక విద్యా సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు ఆర్ధిక సాయం పొందే అవకాశముంది. యూజీసీ ఈ స్కాలర్ షిప్ అందిస్తోంది. దేశంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో పీజీ చదివేవారికి వర్తిస్తుంది. ఇది జాతీయ స్థాయి పింఛన్ పథకం. దీంతో దేశంలో పీజీ చదువుకుంటున్న విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకుని లబ్ది పొందవచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ ఆర్ధిక సాయం అందించాని ప్రభుత్వం నిర్ణయించింది. పీజీలో ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పోర్టల్‌లోకి వెళ్లి వివరాలు పూర్తి చేయడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు మీ మెరిట్‌ను పరిశీలించి స్కాలర్ షిప్ మంజూరు చేస్తారు. 10 వేల స్కాలర్‌షిప్‌లు ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. ఆల్ ఇండియా మెరిట్ ఆధారంగా లబ్దిదారుల ఎంపిక అనేది జరుగుతుంది. ఇందులో మహిళా అభ్యర్థులకు 30 శాతం స్లాట్లు కేటాయించారు. సింగిల్, ట్విన్ లేదా ఫ్రాటర్నల్ గర్ల్ చైల్డ్ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ నగదును విద్యార్థులు పుస్తకాలు, ప్రయాణం, విద్య సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. స్కాలర్‌షిప్ మంజూరు, చెల్లింపులు, పునరుద్దరణకు సంబంధించి కొన్ని నిబంధనలు యూజీసీ రూపొందింది. దీని ప్రకారం స్కాలర్ షిప్ అందించడం జరుగుతుంది. దరఖాస్తుదారుడు భారతీయుడై ఉండాలి. గుర్తింపు పొందిన విద్యాసంస్థలో పీజీ అడ్మిషన్ పొంది ఉండాలి. మొదటి పీజీ డిగ్రీ ప్రొగ్రాం అయి ఉండాలి. పీజీ కోర్సు రెగ్యూలర్ లేదా ఫుల్ టైమ్ విధానంలో చదువుతూ ఉండాలి. అడ్మిషన్ పొందే సమయంలో విద్యార్థి వయస్సు 30 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలి. విద్యాసంస్థ యూజీసీ గుర్తింపును కలిగి ఉండాలి.

Follow Us
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు