AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: గోల్కొండ కోటపై జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం రాష్ట్ర ప్రజలకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందు గోల్కొండ కోటకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.

CM Revanth Reddy: గోల్కొండ కోటపై జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy Golconda Fort Flag Hoisting
Anand T
|

Updated on: Aug 15, 2026 | 1:15 PM

Share

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య సమరయోదులను నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పేదవాడికి ఆకలి నుంచి విముక్తి.. రైతుకు అప్పుల నుంచి విముక్తి.. మహిళకు ఆర్థిక స్వేచ్ఛ.. యువతకు ఉపాధి.. బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థమని సీఎం రేవంత్ అన్నారు.

మహాత్మాగాంధీ, స్వాతంత్ర్య సమరయోధులు చూపిన మార్గం.. స్వాతంత్ర్యం తర్వాత వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, విజ్ఞానం, సాంకేతిక రంగాలకు వేసిన పునాదుల స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యాలుగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టి 32 నెలలు పూర్తయింది. దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టిన మా ప్రభుత్వం సంక్షేమాన్ని విస్తరించింది. అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించింది. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన విధానాలు, చట్టాలు, భారీ ప్రాజెక్టులు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు బలమైన పునాదులు వేసింది. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే కార్యక్రమాలు తలపెట్టిందని రేవంత్ తెలిపారు.

32 నెలల ప్రజాపాలన ఫలితాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం పెరిగిందన్నారు. రైతు బాగుంటేనే మ‌నం బాగుంటామ‌ని ప్రభుత్వం భావిస్తోందని.. అందుకే రైతంగానికే ఎక్కవ ప్రధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీతో 25 లక్షల కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి కల్పించామన్నారు.

మన రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. వరి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి దేశంలో నంబర్‌–1గా నిలిచారని తెలిపారు. యాసంగిలో 81.12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవడంతో ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించిందన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

Follow Us