AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా డబ్బులు.. ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్!

Telangana housing scheme: పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే రాష్ట్రంలో పూరిగుడిసెలు అనేవే ఉండకూడదని ఉద్దేశంతో.. వాటిని పక్కా ఇళ్లు మార్చేందుకు ప్రభుత్వం రూ.5లక్షలు అందిస్తోంది.. అయితే తాజాగా అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా రూ.2 నుంచి 3లక్షల వరకు అందిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Telangana: అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా డబ్బులు.. ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్!
Telangana Indiramma Housing
Anand T
|

Updated on: Sep 26, 2026 | 8:49 PM

Share

తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. అసంపూర్తిగా ఉన్న ఇళ్లు మొండిగోడలు, స్లాబ్ స్థాయిలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణానికి రూ.2 నుంచి 3లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు స్పష్టం చేశారు. తాజాగా శనివారం జనగామా జిల్లాలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని.. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందించినట్టు తెలిపారు. దసరాలోపు 2.18లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఇక రెండో విడతలో కూడా 2.50లక్షల ఇళ్లను మంజూరు చేసి.. ప్రతి నియోజకవర్గానాకి 2000వేల ఇళ్ల చొప్పున మంజూరు చేసినట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని పూరిగుడిసెలను పక్కాళ ఇళ్లుగా మార్చేందుకు.. రూ.5లక్షలు అందిస్తున్నట్టు తెలిపారు.

అంతేకాదు గత ప్రభుత్వం సగం నిర్మించి ఆపేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి ప్రజలు అందిస్తామని తెలిపారు. జనగామ జిల్లాలో ఇందుకోసం రూ.2 కోట్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి దసరా కానుకగా కొత్త ఇళ్లను ఇస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us