AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరాకి బోటీ ఫ్రై చేస్తున్నారా.. ఇలా చేయండి పాపడాల్లా తినేస్తారు

దసరా పండుగ వచ్చేసింది. అక్టోబర్ 20న ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో రక రకాల వంటలు ప్రిపేర్ చేసుకుంటారు. చికెన్ ,మటన్, బోటీ వంటివి తప్పకుండా ఉంటాయి.

Samatha J
|

Updated on: Oct 19, 2026 | 8:35 AM

Share
దసరా వచ్చిందంటే చాలు ప్రతి ఇంటిలో యాట కూర చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఇక తెలంగాణలో ప్రతి ఒక్కరూ మటన్‌తో రక రకాల వంటకాలు చేస్తుంటారు. బోటీ ఫ్రై, మటన్ కర్రీ, బ్రేయిన్ కర్రీ ఇలా రక రకాల కర్రీలు ప్రిపేర్ చేస్తుంటారు. అయితే మీరు కూడా ఈ దసరాకు బోటీ ఫ్రై చేయాలి అనుకుంటున్నారా? ఇలా చేయండి. దీని వలన బోటీ ఫ్రైని పాపడాల్లా తినేస్తారు.

1 / 5
దీనిని తయారు చేయడానికి ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. ముందుగా, ఒక కడాయిలో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూరకి అద్భుతమైన సువాసనను, రుచిని ఇస్తుంది.

2 / 5
అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించుకోవాలి. ఆ తరువాత, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలపాలి.

3 / 5
ఇప్పుడు, కొద్దిగా పసుపు, ముందుగా ఉడకబెట్టుకున్న బోటిని వేసి బాగా గోలించాలి. బోటి బాగా గోలిన తర్వాత, ఉడకబెట్టిన బోటి నీళ్లను కూడా వేసి మరికొద్దిసేపు గోలించాలి. నీరు మొత్తం ఇంకిపోయే వరకు బోటీ ఉడికించుకోవాలి ఈ దశలో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి, రుచికి సరిపడా కూర కారం వేసి అన్నీ బాగా కలిసేలా చూడాలి.

4 / 5
దీని తర్వాత  కడాయిపై మూత పెట్టి, మసాలాలు బోటికి బాగా పట్టేలా, కూర మగ్గేలా చిన్న మంటపై ఉడికించాలి. చివరగా, ఒక ప్లేట్‌లోకి తీసుకుని పైన కొద్దిగా పుదీనా చల్లుకుంటే వేడి వేడి, రుచికరమైన గోలించిన బోటి ఫ్రై సిద్ధం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. తింటే టేస్ట్ అదిరిపోతుంది.

5 / 5
Follow Us