AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలితో పెళ్లి .. ఉన్నదంతా అమ్మేసి 1,900 కి.మీ. ప్రయాణం.. అసలు నిజం తెలిసి షాక్!

బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి తన కలల ప్రియురాలిని కలుసుకోవాలని ఆశపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకోసం తన దగ్గరున్న ఆస్తులన్నీ అమ్మేసి 1,900 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. కానీ అక్కడికి వెళ్లాక అతడికి ఊహించని షాక్‌ ఎదురైంది.

ప్రియురాలితో పెళ్లి .. ఉన్నదంతా అమ్మేసి 1,900 కి.మీ. ప్రయాణం.. అసలు నిజం తెలిసి షాక్!
Brazilian Man Sold Everything Travelled Long Distance To Meet His Dream Girl She Was Ai Generated
Sharada V
|

Updated on: Oct 19, 2026 | 9:14 AM

Share

బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి తన కలల ప్రియురాలిని కలుసుకోవాలని ఆశపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకోసం తన దగ్గరున్న ఆస్తులన్నీ అమ్మేసి 1,900 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. కానీ అక్కడికి వెళ్లాక అతడికి ఊహించని షాక్‌ ఎదురైంది. ఇంతకాలం తను ప్రేమించిన మహిళ నిజమైన వ్యక్తి కాదు.. కృత్రిమ మేధస్సు (AI) సృష్టించిన ఓ కల్పిత పాత్ర అతని తెలుసుకుని కుప్పకూలిపోయాడు.

తల్లి మరణంతో ఒంటరితనం.. సోషల్ మీడియాలో పరిచయం

ఈశాన్య బ్రెజిల్‌ మారన్యావో రాష్ట్రానికి చెందిన 49 ఏళ్ల ఎడిమార్ మార్టిన్స్ ఇటుకల పని చేస్తుంటాడు. తల్లి మరణం తర్వాత అతడు తీవ్ర ఒంటరితనానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే 2020లో సోషల్ మీడియాలో జెస్సికా ఒలివెరాను చూశాడు. ఆమెను జెస్సికా ఫజెండెరా అనే పేరుతో కూడా పిలిచేవాడు. ఆ ఎకౌంట్ లో ఓ అందమైన గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రంలో నివసిస్తున్నట్లు కనిపించే మహిళ వీడియోలు ఉండేవి. అక్కడి ప్రశాంతమైన జీవితం, ఆమె మాటలు మార్టిన్స్‌ను ఆకర్షించాయి. ఆ ఖాతాకు మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు.. తన దగ్గరకు వస్తే నివసించడానికి ఇల్లు ఇస్తానని, ఆర్థికంగా కూడా సహాయం చేస్తానని ఆమె వీడియోల్లో చెప్పింది. దీంతో తన జీవితంలో ఎదురైన ఒంటరితనానికి ఆమెతో పరిచయం పరిష్కారం చూపుతుందని మార్టిన్స్ నమ్మాడు. ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని ఆశపడ్డాడు.

ఉన్నదంతా అమ్మేసి 1,900 కిలోమీటర్ల ప్రయాణం

జెస్సికాను కలుసుకోవాలనే కోరిక రోజురోజుకూ పెరగడంతో మార్టిన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆమెను ప్రత్యక్షంగా కలిసి తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తన దగ్గరున్న వస్తువులను అమ్మి ప్రయాణానికి అవసరమైన డబ్బు సమకూర్చుకున్నాడు. అక్టోబర్ 9న బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్ర రాజధాని బెలో హొరిజోంటేకు వెళ్లేందుకు బయలుదేరాడు. బస్సులో ఒక రోజుకు పైగా ప్రయాణించి అక్టోబర్ 11న అక్కడికి చేరుకున్నాడు. తన కలల ప్రియురాలిని కలుసుకోబోతున్నాననే ఆనందంతో ఆమె ఫొటోలను వెంట తీసుకెళ్లాడు.

ఫొటోలు చూపించి అడిగినా.. ఎవరూ గుర్తుపట్టలేదు!

బెలో హొరిజోంటేకు చేరుకున్న తర్వాత మార్టిన్స్ జెస్సికా కోసం వెతకడం ప్రారంభించాడు. ఆమె ఫొటోలను స్థానికులకు చూపిస్తూ, ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసా? అని అడిగాడు. అయితే ఆమెను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. చివరకు ఏం చేయాలో తెలియక ఓ స్థానిక రేడియో స్టేషన్‌ను సంప్రదించాడు. అక్కడే అతడికి అసలు విషయం తెలిసింది. జెస్సికా అనే మహిళ నిజంగా ఉనికిలో లేదని, సోషల్ మీడియాలో ఉన్న ఖాతా నకిలీదని  చెప్పారు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్న మహిళ అసలు మనిషే కాదని.. ఆమెను ఏఐ సాంకేతికతతో సృష్టించారని తెలుసుకుని మార్టిన్స్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ ఘటనపై అతడు స్పందిస్తూ.. సంబంధం కోసం, కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో అక్కడికి వచ్చానని, కానీ చివరకు బాధ, నిరుత్సాహం మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు నిజం ఒప్పుకున్న ఏఐ ఖాతా నిర్వాహకుడు

ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఖాతా వెనుక ఉన్న వ్యక్తి స్పందించాడు. జెస్సికా అనేది కృత్రిమ మేధస్సుతో రూపొందించిన పాత్రేనని అంగీకరించాడు. మార్టిన్స్‌తో తాను ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదని, సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ పెంచుకుని, దాని ద్వారా ఆదాయం పొందడమే తన ఉద్దేశమని తెలిపాడు. మార్టిన్స్ బెలో హొరిజోంటేకు వచ్చాడన్న విషయం  ఆశ్చర్యం కలిగించిందని తెలిపాడు.

నగరంలో చిక్కుకున్న వ్యక్తికి అధికారుల సాయం

జెస్సికాను కలుసుకోవాలనే ఆశతో తన దగ్గరున్న డబ్బును ప్రయాణానికే ఖర్చు చేయడంతో మార్టిన్స్ బెలో హొరిజోంటేలో ఇబ్బందుల్లో పడ్డాడు. తిరిగి వెళ్లేందుకు కూడా డబ్బు లేకపోవడంతో స్థానిక మున్సిపల్ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు, సామాజిక సేవా సిబ్బంది అతడికి సహాయం అందించారు. భోజనం, స్నానం చేసుకునే సదుపాయాలతో పాటు నగరం నుంచి తిరిగి వెళ్లేందుకు బస్సు టికెట్ ఇచ్చారు. అయితే ఈ చేదు అనుభవంతో మార్టిన్స్ ప్రేమపై ఆశలు వదులుకోలేదు. ప్రస్తుతం ఓ కుటుంబ సభ్యుడి వద్ద ఉంటున్న అతడు, నిజమైన జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ మళ్లీ బెలో హొరిజోంటేకు వెళ్లాలని భావిస్తున్నాడు.

ఆరు నెలల్లో ముగ్గురికి ఇలాంటి అనుభవమే!

కేవలం ఆరు నెలల వ్యవధిలో బెలో హొరిజోంటేకు వెళ్లి, ఏఐ సృష్టించిన మహిళను నిజమైన వ్యక్తిగా భావించి కలుసుకోవాలని ప్రయత్నించిన మూడో వ్యక్తి మార్టిన్స్. ఒంటరితనంలో ఉన్నవారిలో సోషల్ మీడియాలో పరిచయాలు కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. కానీ ఆ పరిచయం వెనుక నిజమైన వ్యక్తి ఉన్నాడో లేదో నిర్ధారించుకోకుండా జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకుంటే చేదు అనుభవాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

Follow Us
ప్రియురాలితో పెళ్లి.. 1,900 కి.మీ ప్రయాణం.. చివరికి షాక్!
ప్రియురాలితో పెళ్లి.. 1,900 కి.మీ ప్రయాణం.. చివరికి షాక్!
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి పిల్లి ఇదే.. తర్వాత ఏం జరిగిందంటే..!
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి పిల్లి ఇదే.. తర్వాత ఏం జరిగిందంటే..!
న్యూజిలాండ్ తో తొలి టీ20.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు..!
న్యూజిలాండ్ తో తొలి టీ20.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు..!
టైగర్ ష్రాఫ్‌ కాల్పుల కేసులో పోలీసులకు చిక్కిన కీలక ఆధారం!
టైగర్ ష్రాఫ్‌ కాల్పుల కేసులో పోలీసులకు చిక్కిన కీలక ఆధారం!
గోల్డ్ లోన్ కట్టకపోతే నగలను వేలం వేస్తారా..? రూల్స్ ఇవే..
గోల్డ్ లోన్ కట్టకపోతే నగలను వేలం వేస్తారా..? రూల్స్ ఇవే..
ధనవంతులు డబ్బును ఎక్కువగా ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తారో తెలుసా..?
ధనవంతులు డబ్బును ఎక్కువగా ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తారో తెలుసా..?
బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్
బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్
పాములు ఎక్కడ దాక్కుంటాయో తెలుసా?
పాములు ఎక్కడ దాక్కుంటాయో తెలుసా?
దసరాకి బోటీ ఫ్రై చేస్తున్నారా.. ఇలా చేయండి పాపడాల్లా తినేస్తారు
దసరాకి బోటీ ఫ్రై చేస్తున్నారా.. ఇలా చేయండి పాపడాల్లా తినేస్తారు
ఫ్లోరిడాలో విషాదం.. చేపలు పడుతుండగా మొసలి దాడిలో వృద్ధుడు మృతి
ఫ్లోరిడాలో విషాదం.. చేపలు పడుతుండగా మొసలి దాడిలో వృద్ధుడు మృతి