AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లోరిడాలో విషాదం.. చేపలు పడుతుండగా భారీ మొసలి దాడిలో 71 ఏళ్ల వృద్ధుడు మృతి!

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన 71 ఏళ్ల వృద్ధుడు మొసలి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. సరస్సు ఒడ్డున చేపలు పడుతున్న సమయంలో సుమారు 12 అడుగుల పొడవున్న అలిగేటర్ ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. ఆ తర్వాత అతడిని నీటిలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

ఫ్లోరిడాలో విషాదం.. చేపలు పడుతుండగా భారీ మొసలి దాడిలో 71 ఏళ్ల వృద్ధుడు మృతి!
Man Fishing In Florida Lake Dies By Alligator Attack
Sharada V
|

Updated on: Oct 19, 2026 | 8:31 AM

Share

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన 71 ఏళ్ల వృద్ధుడు మొసలి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. సరస్సు ఒడ్డున చేపలు పడుతున్న సమయంలో సుమారు 12 అడుగుల పొడవున్న అలిగేటర్ ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. ఆ తర్వాత అతడిని నీటిలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఫ్లోరిడాలోని వింటర్ గార్డెన్ పట్టణానికి సమీపంలో ఉన్న లేక్ అపోప్కా వద్ద ఈ ఘటన జరిగింది. 71 ఏళ్ల హామిల్టన్ అనే వ్యక్తి సరస్సు ఒడ్డున చేపలు పడుతుండగా మొసలి అతడి దగ్గరకు వచ్చింది. ఊహించని విధంగా అతడిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లింది. సరస్సులో ఇతర మొసళ్లు కూడా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అధికారులు నియమించిన ఓ ట్రాపర్ ఆ మొసలిని పట్టుకుని అక్కడి నుంచి తొలగించాడు.

ఫ్లోరిడాలో 13 లక్షల మొసళ్లు!

ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ అంచనా ప్రకారం.. ఆ రాష్ట్రంలో సుమారు 13 లక్షల మొసళ్లు ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 67 కౌంటీల్లోనూ ఇవి కనిపిస్తాయి. సరస్సులు, నదులు, చిత్తడి నేలలు, బురద ప్రాంతాలు, కాలువల్లో మొసళ్లు నివసిస్తుంటాయి. ముఖ్యంగా మంచినీటి వనరుల సమీపంలో అవి ఎక్కువగా కనిపిస్తాయి. లేక్ అపోప్కా కూడా మొసళ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ ఏడాది ఫ్లోరిడాలో జరిగిన రెండో ప్రాణాంతక మొసలి దాడి ఇదేనని సమాచారం. దీంతో సరస్సులు, నదుల వద్దకు వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

నీటి ఒడ్డున ఉన్నా ప్రమాదమే!

సాధారణంగా మొసళ్లు నీటిలోనే ఉంటాయని చాలామంది భావిస్తారు. అయితే అవి నీటి ఒడ్డున కూడా నిశ్శబ్దంగా వేచి ఉంటాయి. నీటిలో మొసలి కనిపించకపోయినా అక్కడ ప్రమాదం లేదని అనుకోవడం పొరపాటే. సరస్సులు, చెరువులు, నదులు, కాలువలు, చిత్తడి నేలల వద్ద అవి ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. ఫ్లోరిడాలోని నీటి ప్రాంతాలకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మొసళ్లకు దూరంగా ఉండాలి. వాటికి ఆహారం వేయకూడదు. ఫొటోలు తీసుకోవడం కోసం వాటి దగ్గరకు వెళ్లకూడదు. చేపలు పట్టేటప్పుడు, బోటింగ్ చేసేటప్పుడు, సరస్సుల సమీపంలో గడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

ఫ్లోరిడాలో ఈ 3 సరస్సుల్లో మొసళ్ల రాజ్యం

ఫ్లోరిడాలోని లేక్ ఓకీచోబీ, లేక్ కిస్సిమ్మీ, లేక్ జెసప్ లో వేల సంఖ్యలో మొసళ్లు నివసిస్తున్నాయి. సుమారు 730 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న లేక్ ఓకీచోబీలో లోతు తక్కువగా ఉండటంతో పాటు, దట్టమైన జలవృక్షాలు, చిత్తడి నేల, మొసళ్లకు అనుకూలమైన ఆవాసాలుగా మారాయి. ఎండలో శరీరాన్ని వేడెక్కించుకోవడానికి, సంతానోత్పత్తి సమయంలో సంచరించడానికి ఇవి ఇలాంటి ప్రదేశాలను ఎంచుకుంటాయి. సంతానోత్పత్తి కాలంలో మొసళ్లు మరింత చురుగ్గా ఉండే అవకాశం ఉంది. ఎండ పడే ఇసుక ప్రాంతాల్లో కూడా ఇవి కనిపిస్తాయి. భారీ సంఖ్యలో మొసళ్లు ఉండటంతో ఈ సరస్సు పర్యాటకులను ఆకర్షించే ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది.

Follow Us
ఫ్లోరిడాలో విషాదం.. చేపలు పడుతుండగా మొసలి దాడిలో వృద్ధుడు మృతి
ఫ్లోరిడాలో విషాదం.. చేపలు పడుతుండగా మొసలి దాడిలో వృద్ధుడు మృతి
అహోబిలంలో భారీ అగ్ని ప్రమాదొం.. రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం..!
అహోబిలంలో భారీ అగ్ని ప్రమాదొం.. రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం..!
వెండి బతుకమ్మపై విమర్శలు.. పీవీ సింధు స్ట్రాంగ్ కౌంటర్..
వెండి బతుకమ్మపై విమర్శలు.. పీవీ సింధు స్ట్రాంగ్ కౌంటర్..
మహిళల కోసం ఏర్పడిన ప్రత్యేక గ్రామం..!
మహిళల కోసం ఏర్పడిన ప్రత్యేక గ్రామం..!
కోలాటాలు, చండి మేళం..శ్రీశైలంలో ఘనంగా భ్రమరాంబికాదేవి గ్రామోత్సవం
కోలాటాలు, చండి మేళం..శ్రీశైలంలో ఘనంగా భ్రమరాంబికాదేవి గ్రామోత్సవం
పండక్కి అక్కను తీసుకరావడానికి వెళ్లిన తమ్ముడు..
పండక్కి అక్కను తీసుకరావడానికి వెళ్లిన తమ్ముడు..
దసరా స్పెషల్.. కొత్త అల్లుడికి నచ్చేలా మటన్ కర్రీ వండాలా..
దసరా స్పెషల్.. కొత్త అల్లుడికి నచ్చేలా మటన్ కర్రీ వండాలా..
టీమిండియాకు దొరికిన సరికొత్త ఆయుధం.. ఇక ప్రపంచ జట్లకు బడితపూజే..!
టీమిండియాకు దొరికిన సరికొత్త ఆయుధం.. ఇక ప్రపంచ జట్లకు బడితపూజే..!
Post Office టాప్‌ 5 స్కీమ్స్‌ గురించి తెలుసా? మీకు ఏది బెస్ట్..?
Post Office టాప్‌ 5 స్కీమ్స్‌ గురించి తెలుసా? మీకు ఏది బెస్ట్..?
నోటి పూత ఎందుకు వస్తుంది? తగ్గించుకోవడానికి ఈ సింపుల్ చిట్కాలు
నోటి పూత ఎందుకు వస్తుంది? తగ్గించుకోవడానికి ఈ సింపుల్ చిట్కాలు