PV Sindhu: వెండి బతుకమ్మపై విమర్శలు.. పీవీ సింధు స్ట్రాంగ్ కౌంటర్.. ఏమందంటే?
PV Sindhu Silver Bathukamma: బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఫొటోపై వచ్చిన సోషల్ మీడియా విమర్శలకు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్పందించారు. వెండి బతుకమ్మను పట్టుకున్న ఫొటోపై ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు సింధు సమాధానం ఇచ్చారు. తెలంగాణ సంప్రదాయాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇతరులపై అభిప్రాయం ఏర్పరచుకోవాలని సూచించారు.

PV Sindhu Silver Bathukamma: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది ఎంతో మిస్ అవుతున్నానంటూ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. గతేడాది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే, ఆ ఫొటోల్లో సింధు వెండితో తయారు చేసిన బతుకమ్మను చేతిలో పట్టుకుని కనిపించడంతో ఓ నెటిజన్ ఆమెపై విమర్శలు చేశాడు. దీనికి సింధు స్పందిస్తూ.. విమర్శలు చేసే ముందు తెలంగాణ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.
గతేడాది తన భర్తతో కలిసి జరుపుకున్న తొలి బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సింధు పంచుకున్నారు. ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ పండుగలోని రంగులు, అందమైన పూలు, సందడి వాతావరణాన్ని ఈ ఏడాది చాలా మిస్ అవుతున్నానని ఆమె పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినది: జస్ట్ 6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. యూవీ 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్..
అయితే, సింధు చేతిలో వెండి బతుకమ్మ ఉన్న ఫొటోపై ఓ నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘పూలు పేర్చితేనే బతుకమ్మ అంటారు.. మీ పైత్యాన్ని పండుగపై రుద్దకండి’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై సింధు స్పందిస్తూ తన కుటుంబంలో బతుకమ్మను జరుపుకునే విధానం గురించి వివరించారు.
తన పుట్టింటి కుటుంబంలో బతుకమ్మ పండుగను జరుపుకునే సంప్రదాయం లేదని సింధు తెలిపారు. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన కుటుంబంలోకి కోడలిగా వెళ్లిన తర్వాతే తనకు బతుకమ్మ పండుగతో అనుబంధం ఏర్పడిందని చెప్పారు.
Before passing judgment, please understand the tradition ❤️
We don’t traditionally celebrate Bathukamma in my family, so this was my very first! And I’ve married into a family from the very heart of Telangana – Karimnagar.
See that rather large floral Bathukamma in the background ? I spent pretty much the whole day decorating it 😂, and that’s what we celebrated with!
The silver Bathukamma was my mother-in-law’s way of welcoming me into a tradition that’s so close to her heart ❤️
Surely, there’s room for a mother’s love alongside tradition ❤️
— PV Sindhu (@Pvsindhu1) October 18, 2026
వెనుక కనిపిస్తున్న పెద్ద పూల బతుకమ్మను తానే స్వయంగా ఎంతో ఇష్టంగా, రోజంతా సమయం కేటాయించి పేర్చానని సింధు వెల్లడించారు. ఆ పూల బతుకమ్మతోనే తాము పండుగను జరుపుకున్నామని స్పష్టం చేశారు.
ఎక్కువమంది చదివినది: తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు.. ప్రపంచ రికార్డ్ నే షేక్ చేసిన టీమిండియా నయా సెన్సేషన్..!
వెండి బతుకమ్మ విషయానికి వస్తే.. అది తన అత్తగారు తనపై చూపించిన ప్రేమకు గుర్తు అని సింధు వివరించారు. తెలంగాణ సంప్రదాయంలోకి తనను ఆప్యాయంగా ఆహ్వానించేందుకు ఆమె ఇచ్చిన బహుమతిగా వెండి బతుకమ్మను పేర్కొన్నారు.
ఏదైనా అభిప్రాయానికి వచ్చే ముందు ఎదుటి వ్యక్తుల సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలని సింధు సూచించారు. సంప్రదాయంతో పాటు కుటుంబ సభ్యుల ప్రేమకు కూడా చోటు ఉంటుందని ఆమె తన సమాధానంతో స్పష్టం చేశారు. ఈ స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




