AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఈ ముగ్గురు ఔట్.. మరోసారి టీమిండియాలో కనిపించరంతే..?

India Squad for New Zealand: భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే, వెస్టిండీస్ సిరీస్ ముగిసిన వెంటనే ముగ్గురు ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కలేదు. వాళ్లు ఎవరు, ఎందుకు వీరికి ఛాన్స్ రాదో ఇప్పుడు తెలుసుకుందాం..!

Venkata Chari
|

Updated on: Oct 18, 2026 | 5:25 PM

Share
India Squad for New Zealand: వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత జట్టుకు గట్టి పోటీ ఎదురైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలుచుకోగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమమైంది. ఇప్పుడు భారత్ ముందు న్యూజిలాండ్ సవాల్‌ ఉంది. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

1 / 5
వన్డే, టీ20 జట్లను పరిశీలిస్తే.. వెస్టిండీస్‌తో ఆడినప్పటికీ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాని ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. వారిలో యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. వన్డే జట్టులో జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం చూస్తే.. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను ఉన్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

2 / 5
1. రవీంద్ర జడేజా: రవీంద్ర జడేజా దాదాపు ఎనిమిది నెలల తర్వాత భారత వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. జనవరిలో న్యూజిలాండ్ సిరీస్ తర్వాత వెస్టిండీస్‌తో ఆడే అవకాశం లభించింది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో జడేజా ఆడే అవకాశం ఉందని భావించారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో జడేజాకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జడేజా స్థానాన్ని వన్డే జట్టులో నమన్ ధీర్ భర్తీ చేసినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

3 / 5
2. యశస్వి జైస్వాల్: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో యశస్వి జైస్వాల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే జట్టులో మాత్రం ఉన్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌కు అతనికి బ్యాకప్ ఓపెనర్‌గా అవకాశం దక్కుతుందనే ఆశలు కూడా ముగిశాయి. ఎందుకంటే అతనికి జట్టులో పూర్తిగా చోటు దక్కలేదు. అయితే ఈ నిర్ణయం కొంతవరకు సహజమేనని చెప్పొచ్చు. వన్డేల్లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్నే ఓపెనింగ్ జోడీగా కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది.

4 / 5
3. రవి బిష్ణోయ్: రవి బిష్ణోయ్ టీ20 జట్టులో ఉన్నప్పటికీ వెస్టిండీస్‌తో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. వెస్టిండీస్ సిరీస్ తరహాలోనే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కూడా భారత్ ఇద్దరు ప్రధాన స్పిన్నర్లను ఎంపిక చేసింది. వెస్టిండీస్ సిరీస్‌లో రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ జట్టులో ఉన్నారు. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుండగా, బిష్ణోయ్‌కు మాత్రం చోటు దక్కలేదు. అతని స్థానంలో వరుణ్ చక్రవర్తి టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు.

5 / 5
Follow Us
వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఈ ముగ్గురు ఔట్.. మరోసారి నో ఛాన్స్..?

నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న..

హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

వాటర్ వేస్ట్ చేస్తే.. మీకు కూడా ఇదే పరిస్థితి.. జలమండలి సీరియస్

మోకాళ్ల నొప్పులు, పొట్ట సమస్యలను తగ్గించే అద్భుత పువ్వు..

JEE Advancedలో మార్పులు.. మూడో ప్రయత్నంకు అవకాశం ఉంటుందా?

మీ ఆధార్ ఇతరులు ఉయోగించకుండా ఉండాలంటే ఈ పని చేయండి

తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టిన జానకిరామ్

నా ఫొటోలు, వీడియోలతో ఏఐ కంటెంట్ క్రియేట్ చేస్తే ఊరుకోను..

కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా?