AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI ఐదో టీ20కి వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికంటే..?

IND vs WI Match Washout: మొత్తానికి, భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఈ కీలక పోరులో వాతావరణం కీలక పాత్ర పోషించనుంది. వర్షం సహకరించి మ్యాచ్ పూర్తిగా జరిగితేనే ఏ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంటుందో తేలుతుంది.

IND vs WI ఐదో టీ20కి వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికంటే..?
Ind Vs Wi 5th T20i Weather Report
Venkata Chari
|

Updated on: Oct 17, 2026 | 6:14 PM

Share

IND vs WI Match Washout: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ చివరి దశకు చేరింది. ఫైనల్ మ్యాచ్ నేడు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. అయితే, ఈ టీ20పై వరుణుడి ప్రభావం పడితే సిరీస్ విజేతను ఎలా నిర్ణయిస్తారు? మ్యాచ్ పూర్తిగా రద్దయితే ట్రోఫీ ఎవరికి దక్కుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఓసారి చూద్దాం..!

భారత్ vs వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు..

భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి సిరీస్ 2–2తో సమంగా ఉంది. దీంతో ఐదో టీ20 కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. అయితే, బెంగళూరులో సాయంత్రం వర్షం పడే అవకాశాలు ఉండటంతో మ్యాచ్ నిర్వహణపై ఆందోళన నెలకొంది.

వాతావరణ అంచనాల ప్రకారం, మ్యాచ్ ప్రారంభ సమయమైన రాత్రి 7 గంటల సమయంలోనూ వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షం ఆగిన తర్వాత మైదానాన్ని త్వరగా సిద్ధం చేయగలిగితే ఓవర్లను తగ్గించైనా మ్యాచ్ నిర్వహించే వీలుంటుంది.

మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికి?

వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయి, ఫలితం తేలకపోతే భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ 2–2తో సమంగా ముగుస్తుంది. అప్పుడు రెండు జట్లూ ట్రోఫీని పంచుకుంటాయి. ఏ జట్టునూ సిరీస్ విజేతగా ప్రకటించరు. ఈ మ్యాచ్ కోసం రిజర్వ్ డే లేదని నివేదికలు వెల్లడించాయి.

మ్యాచ్ ఫలితం రావాలంటే ఎన్ని ఓవర్లు ఆడాలి?

టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో సాధారణంగా ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం ఐదు ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేయగలగాలి. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే ఓవర్లను కుదించి నిర్వహించవచ్చు. డక్‌వర్త్–లూయిస్–స్టెర్న్ (DLS) పద్ధతిలోనూ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. అయితే, వర్షం కారణంగా కనీసం అవసరమైన ఆట కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వస్తుంది.

Follow Us