AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: పోస్ట్ ఆఫీస్‌లో టాప్‌ 5 స్కీమ్స్‌ గురించి తెలుసా? మీకు ఏది బెస్టో చూసుకోండి..!

Post Office Scheme: పోస్ట్‌ ఆఫీస్‌లో రకరకాల ఇన్వెస్ట్‌మెంట్‌ పథకాలు ఉన్నాయి. పోస్టాఫీసులలో పెట్టుబడి పెట్టి మంచి రాబడి పొందవచ్చు. ఈ పథకాలు వినియోగదారులకు ఎలాంటి రిస్క్‌ లేకుండా రాబడిని అందిస్తాయి. అయితే పోస్ట్‌ ఆఫీసులలో టాప్‌ 5 స్కీమ్స్‌ గురించి తెలుసుకుందాం..

Post Office: పోస్ట్ ఆఫీస్‌లో టాప్‌ 5 స్కీమ్స్‌ గురించి తెలుసా? మీకు ఏది బెస్టో చూసుకోండి..!
Post Office
Subhash Goud
|

Updated on: Oct 19, 2026 | 7:59 AM

Share

Post Office Schems: భారత ప్రభుత్వ హామీతో కూడిన సురక్షితమైన పెట్టుబడులు కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ పథకాలు చక్కటి ఎంపిక. ఇందులో ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు. పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న టాప్ 5 సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.

1.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF):

  • ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనికి పూర్తిగా ప్రభుత్వ భద్రత ఉంటుంది.ఎన్‌ఆర్‌ఐలు (NRIs) మినహా భారతదేశంలో ఎవరైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్‌లో ఈ ఖాతాను తెరవవచ్చు.
  • కాలపరిమితి: 15 సంవత్సరాలు:
  • పెట్టుబడి పరిమితి: సంవత్సరానికి కనీసం రూ.500 నుండి గరిష్టంగా రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీన్ని ఒకేసారి లేదా విడతలుగా (నెలవారీగా) కూడా జమ చేయవచ్చు.
  • వడ్డీ రేటు: ప్రస్తుతం సుమారు 7.1% వడ్డీ లభిస్తుంది.
  • టాక్స్ మినహాయింపు: ఈ స్కీమ్‌లో సెక్షన్ 80సి కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు టాక్స్ డిడక్షన్ బెనిఫిట్ పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తంపై ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు (EEE కేటగిరీ).
  • లోన్, విత్‌డ్రా సౌకర్యం: ఖాతా తెరిచిన 3వ ఆర్థిక సంవత్సరం నుండి 6వ సంవత్సరం లోపు అర్హతను బట్టి లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది.
  • 6వ సంవత్సరం నుండి పాక్షికంగా డబ్బును వెత్‌డ్రా (Withdraw) చేసుకోవచ్చు.

2. కిసాన్ వికాస్ పత్ర (KVP)

  • పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని నిర్దిష్ట కాలంలో రెట్టింపు చేసే పథకం ఇది.
  • పెట్టుబడి పరిమితి: కనీసం రూ.1,000 నుండి గరిష్ట పరిమితి లేదు.
  • కాలపరిమితి: ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం సుమారు 115 నెలలు (సుమారు 9 సంవత్సరాల 7 నెలలు).
  • వడ్డీ రేటు: ప్రస్తుతం 7.5% వడ్డీ అమలవుతోంది.
  • ముఖ్య గమనిక: దీనికి సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు వర్తించదు. జనరేట్ అయ్యే వడ్డీకి మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం టాక్స్ వర్తిస్తుంది.

3. సుకన్య సమృద్ధి యోజన (SSY):

  • ఆడపిల్లల భవిష్యత్తు (చదువు,పెళ్లి ఖర్చులు) కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం ఇది.
  • అర్హత: 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లల పేరిట తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవవచ్చు.
  • కాలపరిమితి: ఖాతా తెరిచినప్పటి నుండి 21 సంవత్సరాలు. అయితే పెట్టుబడి మాత్రం మొదటి 15 సంవత్సరాలు మాత్రమే చేయాలి.
  • పెట్టుబడి పరిమితి: సంవత్సరానికి కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు.
  • వడ్డీ రేటు: ప్రస్తుతం అత్యధికంగా 8.2% వడ్డీ లభిస్తుంది.
  • మినహాయింపులు: పాపకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ లేదా వివాహం కోసం అవసరమైతే మొత్తం నిధిలో నుండి 50% వరకు డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. దీనికి కూడా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే మెచ్యూరిటీ అమౌంట్ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ.

4. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)

  • ఒకసారి పెట్టుబడి పెట్టి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది.
  • పెట్టుబడి విధానం: ఇది వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ (ఒకేసారి పూర్తి మొత్తం చెల్లించాలి). కాలపరిమితి 5 సంవత్సరాలు.
  • పెట్టుబడి పరిమితి: సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షల వరకు.
  • జాయింట్ ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
  • వడ్డీ రేటు: ప్రస్తుతం 7.4% వడ్డీ ఇస్తున్నారు.
  • ప్రయోజనం: ఉదాహరణకు జాయింట్ ఖాతా ద్వారా రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రతి నెలా సుమారు రూ.9,250 వడ్డీ రూపంలో మీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది.

5. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS)

  • వయసురీత్యా 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకించబడిన పథకం ఇది.
  • అర్హత: 60 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఈ ఖాతా తెరుచుకోవచ్చు.
  • కాలపరిమితి: 5 సంవత్సరాలు.
  • పెట్టుబడి పరిమితి: గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
  • వడ్డీ రేటు: ప్రస్తుతం 8.2% ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది.
  • ప్రత్యేకత: ఈ స్కీమ్‌లో వచ్చే వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి (క్వార్టర్‌కు ఒకసారి) నేరుగా మీ ఖాతాలో జమవుతుంది. ఉదాహరణకు గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి త్రైమాసికానికి సుమారు రూ.61,500 వడ్డీ అందుకోవచ్చు.

గమనిక: చిన్న పోస్ట్ ఆఫీసులలో కొన్నిసార్లు అవగాహన లేక వివరాలు తెలపకపోవచ్చు.పెద్ద లేదా హెడ్ పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించడం ద్వారా ఈ పథకాలను సులభంగా ప్రారంభించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us