AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నీటి వృథాపై జలమండలి సీరియస్.. పబ్‌కు రూ.20 వేల జరిమానా, వాటర్ కనెక్షన్ కట్!

హైదరాబాద్‌ నగరంలో నీటిని వృథా చేసే వారిపై జలమండలి బోర్డు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నీటిని వృథా చేస్తున్నారనే కారణంతో జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు ఏకంగా రూ.20 వేల జరిమానా విధించారు. అంతేకాదు పబ్‌కు తాగునీటి కనెక్షన్‌ సైతం తొలగించారు. అలాగే కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల సరఫరాను కూడా నిలిపివేశారు.

Hyderabad: నీటి వృథాపై జలమండలి సీరియస్.. పబ్‌కు రూ.20 వేల జరిమానా, వాటర్ కనెక్షన్ కట్!
Hyderabad Pub Fined Rs 20,000 For Water Wastage
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 18, 2026 | 5:11 PM

Share

హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సర్కిల్, జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని రోడ్ నంబర్ 45, ప్లాట్ నంబర్ 872లో ఉన్న ఫోర్ ఫాదర్స్ పబ్ లో నీటి దుర్వినియోగానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం నీటి దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, సదరు పబ్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా తాగునీటి కనెక్షన్‌ను తొలగించడంతో పాటు జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను కూడా నిలిపివేశారు.

రానున్న వేసవిలో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. నీటి దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు నీటి కనెక్షన్ల తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది.

వాటర్ వేస్ట్ చేస్తే ఫిర్యాదు చేయండి 

తాగునీటి వృథా, దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు ప్రజల దృష్టికి వచ్చిన పక్షంలో, సంబంధిత ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, ఘటన జరిగిన ప్రాంతం, పూర్తి చిరునామాతో సహా జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003కు సమాచారం అందించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కస్టమర్ కేర్ నంబర్ 155313 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపింది.

అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ఉల్లంఘనలు నిర్ధారణ అయిన పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని జలమండలి హామీ ఇచ్చింది. తాగునీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వాటర్ వేస్ట్ చేస్తే.. మీకు కూడా ఇదే పరిస్థితి.. జలమండలి సీరియస్
వాటర్ వేస్ట్ చేస్తే.. మీకు కూడా ఇదే పరిస్థితి.. జలమండలి సీరియస్
మోకాళ్ల నొప్పులు, పొట్ట సమస్యలను తగ్గించే అద్భుత పువ్వు..
మోకాళ్ల నొప్పులు, పొట్ట సమస్యలను తగ్గించే అద్భుత పువ్వు..
JEE Advancedలో మార్పులు.. మూడో ప్రయత్నంకు అవకాశం ఉంటుందా?
JEE Advancedలో మార్పులు.. మూడో ప్రయత్నంకు అవకాశం ఉంటుందా?
మీ ఆధార్ ఇతరులు ఉయోగించకుండా ఉండాలంటే ఈ పని చేయండి
మీ ఆధార్ ఇతరులు ఉయోగించకుండా ఉండాలంటే ఈ పని చేయండి
తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టిన జానకిరామ్
తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టిన జానకిరామ్
నా ఫొటోలు, వీడియోలతో ఏఐ కంటెంట్ క్రియేట్ చేస్తే ఊరుకోను..
నా ఫొటోలు, వీడియోలతో ఏఐ కంటెంట్ క్రియేట్ చేస్తే ఊరుకోను..
కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా?
కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా?
రణబాలి సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రణబాలి సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
మ్యాచ్ రద్దైనా, మాకో డేంజరస్ ఫినిషర్ దొరికాడు..
మ్యాచ్ రద్దైనా, మాకో డేంజరస్ ఫినిషర్ దొరికాడు..
మిల్లెట్ ఆర్ట్‌తో చిరుధాన్యాల చరిత్ర.. 16 ఫ్రేముల్లో అద్భుతంగా ..
మిల్లెట్ ఆర్ట్‌తో చిరుధాన్యాల చరిత్ర.. 16 ఫ్రేముల్లో అద్భుతంగా ..