AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిల్లెట్ ఆర్ట్‌తో చిరుధాన్యాల చరిత్ర.. 16 ఫ్రేముల్లో అద్భుతంగా ఆవిష్కరణ!

చిరుధాన్యాలు మన శరీరానికి అద్భుతమైన పోషకాలను, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. వీటిలో పీచు పదార్థం , ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. చాలామందికి ఇప్పటికీ అవగాహన లేక ప్రాచీన పురాతన ఆహారాన్ని మనం వదిలేససి.. మోడ్రన్ ఫుడ్ వైపు పరుగులు తీసి మన ఆరోగ్యాన్ని చేతులారా ఫణంగా పెడుతున్నాం

Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 18, 2026 | 4:31 PM

Share
చిరుధాన్యాలు మన శరీరానికి అద్భుతమైన పోషకాలను, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. వీటిలో పీచు పదార్థం , ప్రోటీన్లు, విటమిన్లు,  ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. చాలామందికి ఇప్పటికీ అవగాహన లేక ప్రాచీన పురాతన ఆహారాన్ని మనం వదిలేససి.. మోడ్రన్ ఫుడ్ వైపు పరుగులు తీసి మన ఆరోగ్యాన్ని చేతులారా ఫణంగా పెడుతున్నాం. అందుకే సుప్రసిద్ధ మిల్లెట్ ఆర్టిస్ట్.. చిరుధాన్యాల పట్టు పూర్వకాలం నుంచి.. వర్తమాన కాలంలో పరిస్థితి.. భవిష్యత్తులో మన ఆరోగ్యం వంటి అంశాలపై ఒక ప్రత్యేకమైన చిత్రకళా ప్రదర్శన చేశారు. ఆదిమానవుని కాలం నుంచి మొదలై.. చిరుధాన్యాలు ప్రాచూర్యంలోకి ఎలా వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు  చిత్రకళా రూపాల్లో తీర్చిదిద్దారు.

1 / 5
ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రముఖ మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ రూపొందించిన “ది జర్నీ ఆఫ్ హ్యూమన్ ఫుడ్ – మ్యాన్స్ ఫుడ్ ఎవల్యూషన్ – మిల్లెట్స్” అనే 16 ఫ్రేముల్లో ప్రత్యేక కళా ప్రదర్శనను విశాఖలో ప్రదర్శించారు.  ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మానవ ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులను, చిరుధాన్యాల ప్రాముఖ్యతను, వాటికి దూరం కావడం వల్ల ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహనను, తిరిగి సంప్రదాయ ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని భావితరాలకు తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశం.

2 / 5

మోకా విజయ్ కుమార్ చిరుధాన్యాల తో చిత్రాల వేయడంలో సిద్ధమస్తుడు. ఇందులో భాగంగానే చిరుధాన్యాల ఆవశ్యకత చాటి చెప్పేందుకు ఇప్పటివరకు వందలాది చిత్రాలు వేశారు. రాగులు, కొర్రలు, అరికెలు, సామలు, నల్ల సామలు చిరుధాన్యాలతో వాటికి ఉన్న సహజ సిద్ధ రంగు తోనే చిత్రాలు  వేయడం ప్రత్యేకత. ఇందులో భాగంగానే 16 ప్రేముల్లో.. చిరుధాన్యాల చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆదిమానవుల ఆహారపు అలవాట్లు, తొలి వ్యవసాయ పద్ధతులు, పంటల సాగు, ధాన్యాల నిల్వ, ప్రాచీన ఋషులు, రాజుల కాలంలో ఆహార సంస్కృతిని ప్రతిబింబించారు. అలాగే సాంప్రదాయ వైద్యంలో చిరు ధాన్యాల ప్రస్తావన, వలస పాలనలో ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ఆధునిక ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం, వాటితో ముడిపడిన ఆరోగ్య సమస్యలు, వైద్యుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్లడం వంటి అంశాలను చిరుధాన్యాలతో చిత్ర రూపంలో ప్రదర్శించారు

3 / 5

 మిల్లెట్స్‌పై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తి, రైతులకు తిరిగి చిరుధాన్యాల సాగు నుంచి లభించే అవకాశాలు వంటి అంశాలను ఈ 16 ఫ్రేముల్లో దృశ్యరూపంలో వివరించారు. తల్లి–కూతుళ్లు వంటగదిలో ఆనందంగా వంటలు చేయడం, ఆరోగ్యకరమైన కుటుంబ జీవనం, తాత తన మనవడికి ఆస్తి కంటే ఆరోగ్యకరమైన ఆహారపు విలువ గొప్పదని చెప్పడం వంటి భావోద్వేగ దృశ్యాలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో చోటుచేసుకున్నాయి. “నా ఉద్దేశ్యం కేవలం చిత్రాలు గీయడం కాదు. మన పూర్వీకుల ఆహార సంస్కృతి, చిరుధాన్యాల ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని భావితరాలకు కళ ద్వారా పరిచయం చేయడం. కొందరు ఉపన్యాసాల ద్వారా, మరికొందరు వంటకాల ద్వారా మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. నేను మాత్రం చిరుధాన్యాలతో కళాఖండాలను రూపొందిస్తూ, కళ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. మిల్లెట్స్‌ను తిరిగి మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు రైతుల జీవనోపాధికి కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాను” అని మోకా విజయ్ కుమార్ అంటున్నారు.

4 / 5
2023 నుంచి మిల్లెట్స్ ప్రాచుర్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న విజయ్ కుమార్, చిరుధాన్యాలతో వందలాది ప్రత్యేక కళాఖండాలను రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు డోనాల్డ్ ట్రంప్, వివిధ దేశాల నేతల చిత్రాలను మిల్లెట్స్ తో అందంగా తీర్చిదిద్ది అందరి మన్ననలు అందుకున్నారు. తన కళా ప్రయాణంలో పది కంటే ఎక్కువ ప్రపంచ రికార్డులు, అంతర్జాతీయ గుర్తింపులు సాధించారు. “ఆహారం మనిషి జీవితానికి పునాది. మన మూలాలను గుర్తుచేసుకుని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను భవిష్యత్తు తరాలకు అందించడమే నా కళా ప్రయాణం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

5 / 5
Follow Us