Special Trains: వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్ నుంచి మరిన్ని స్పెషల్ ట్రైన్స్!
ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. దసరా పండ రద్దీని దృష్ట్యా తెలుగురాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ఈ ప్రత్యేక రైలు ఏ రోజుల్లో, ఏ సమయాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందో తాజాగా రైల్వేశాఖ ప్రకటిచింది.

రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగురాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్ల వివరాలు, ఏ టైంలో అందుబాటులో ఉంటాయో ఇక్కడ చూడండి.
ప్రత్యేక రైళ్ల వివరాలు
సికింద్రాబాద్ – విశాఖపట్నం: సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 07071 నెంబర్ గల ప్రత్యేక రైలు ఆదివారం (18.10.2026) రాత్రి 20:15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖపట్నం – సికింద్రాబాద్ : విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే 07072 గల ప్రత్యేక రైళు తిరుగు ప్రయాణంలో సోమవారం (19.10.2026) మధ్యాహ్నం 15:50 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 07:05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఆగేది ఈ స్టేషన్లలోనే
రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లు రెండువైపులా ప్రయాణించే మార్గంలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి మరియు దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక సర్వీసుల్లో ప్రయాణికుల సౌకర్యా్ర్థం ఫస్ట్ ఏసీ కమ్ సెకండ్ ఏసీ, స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను అందుబాటులో ఉంచినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
