AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

El Nino: 125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్.. భయపెడుతున్న వెదర్ రిపోర్ట్‌

సాధారణంగా సమ్మర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. మార్చి లేదా ఏప్రిల్ కదా.. కానీ ఈ సారి మాత్రం పరిస్థితులు వేరుగా ఉండబోతున్నాయట.. ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్ నుంచే ఎండలు చురుకెక్కి.. ఫిబ్రవరి వచ్చేసరికే అసలుసిసలు మిడ్ సమ్మర్ ఉక్కబోత షురూ కాబోతుందట. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో కాలచక్రంలో తీవ్ర గందరగోళం నెలకొందని వెదర్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు జనాల్లో తీవ్ర భయాందోళనకు రేకెత్తిస్తున్నాయి.

El Nino: 125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్.. భయపెడుతున్న వెదర్ రిపోర్ట్‌
Early Summer In February
Anand T
|

Updated on: Oct 18, 2026 | 2:34 PM

Share

నార్మల్‌గా ఎండాకాలం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ప్రారంభమవుతుంది. కానీ ఈసారి వాతావరణ పరిస్థితులు పూర్తిగా తారుమారు కానున్నాయి. ఎండల తీవ్రత అనుకున్న సమయం కంటే ముందే మొదలుకానుంది. క్లైమేట్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం.. ఈసారి ఎండాకాలం ఫిబ్రవరిలోనే ప్రారంభమయ్యే అవకాశముందని హెచ్చరికలు వెలువడ్డాయి. దీనికి ప్రధాన కారణం ఎల్‌నీనో ప్రభావమేనని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నీనో ప్రభావంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ భారీగా పెరిగి, దేశంలోని వాతావరణ సమతుల్యతను అస్తవ్యస్తం చేస్తున్నాయి.

ఎల్‌నీనో ప్రభావం వల్ల ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్నప్పటికీ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధ్యయనాల ప్రకారం, 1901 తర్వాత గత ఆగస్టు నెల అత్యంత వేడి నెలల్లో ఒకటిగా నిలిచింది. రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుందన్న అంచనాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే వానాకాలం ముఖం చాటేయగా, చలికాలం కనీసం పలకరించకుండానే సగానికే ముగిసేలా ఉంది.

అయితే ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్ నుంచే ఎండలు ముదురుతున్నాయి. ఫిబ్రవరి నాటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి మే నెల నాటి మిడ్ సమ్మర్ ఉక్కబోతను తలపించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మార్చి నెలలో అనూహ్యంగా కోల్డ్‌వేవ్ కూడా ఉండవచ్చని వెదర్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

విద్యుత్ కోతలతో అన్నదాతల పోరుబాట

ఇక ఎల్‌నినోతో వర్షాలు లేకపోవడం.. పంటలకు నీరు అందించాల్సిన సమయంలో నెలకొన్న విద్యుత్‌ కోతలు తెలంగాణ అన్నదాతలకు శాపంగా మారుతున్నాయి.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అప్రకటిత కరెంట్ కోతలపై రైతులు ఆందోళన బాట పట్టారు. పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, దోమకొండ, సదాశివనగర్, బిక్కనూర్ మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. కేవలం ఐదారు గంటలు మాత్రమే త్రీ-ఫేస్ కరెంట్ సరఫరా అవుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు సబ్‌స్టేషన్ల ఎదుట నిరసనలకు దిగుతున్నారు.

మూడు జిల్లాలకు తాగునీటి ముప్పు

మరోవైపు సాగునీటి సమస్యే కాకుండా, తాగేందుకు గ్లాసు మంచినీళ్లు కూడా దొరకని దుస్థితి దాపరించింది. సింగూర్, మంజీరా ప్రాజెక్టులలో నీటిమట్టాలు పూర్తిగా అడుగంటిపోవడంతో సంగారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటి ముప్పు ముంచుకొస్తోంది. అసలు సింగూర్‌లో నీళ్లు ఎందుకు అడుగంటిపోయాయి? ఈ నీటి సంక్షోభం ఎంతవరకు దారితీయనుంది? అనే ఆందోళనలు ప్రజల్లో పెరిగిపోతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us