AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anirudh Ravichandran Kavya Maran : ఒక ప్లేటు భోజనానికి 35,000 రూపాయలా..? కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చంటే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు అనిరుధ్ రవిచందర్‌ల వివాహం గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరూ గ్రీస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ వివాహం గురించి ఇరు కుటుంబాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Rajitha Chanti
|

Updated on: Oct 18, 2026 | 1:46 PM

Share
సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, సన్ నెట్‌వర్క్ వారసురాలు కావ్య మారన్, టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. వీరి వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరగనుందని, ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలో అత్యంత ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతుంది.

1 / 5
ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించిన ఖర్చులు, ముఖ్యంగా విందు భోజనానికి అయ్యే ఖర్చు గురించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్ట్రా లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం గ్రీస్‌లోని సెంటోరిని, మైకోనోస్ వంటి సుందరమైన ప్రాంతాలు ఎంతో పేరుగాంచాయి. ఇక్కడ ఒక విలాసవంతమైన వేదికను లేదా రిసార్ట్‌ను ఒక రోజుకు అద్దెకు తీసుకోవడానికి అయ్యే ఖర్చు సుమారుగా రూ. 15 లక్షల నుండి రూ. 45 లక్షల వరకు ఉంటుంది.

2 / 5
అక్కడ జరిగే ఈ హై-ప్రొఫైల్ వివాహ వేడుకలో క్యాటరింగ్ , ఫుడ్ ఏర్పాట్లు అత్యంత ప్రత్యేకంగా ఉండనున్నాయి. నివేదికల అంచనాల ప్రకారం, ఈ లగ్జరీ వెడ్డింగ్‌లో కేవలం ఒక్క వ్యక్తికి పెట్టే భోజనం లేదా ఒక ప్లేట్ ధర సుమారు రూ. 15,000 నుండి రూ. 35,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతిరథ మహారథులు, రాజకీయ, సినీ , క్రీడా దిగ్గజాలు హాజరుకానున్న ఈ వేడుకలో ఫుడ్ మెనూ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

3 / 5
ఇక గ్రీస్‌లో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వెన్యూ అద్దెలు, అతిథుల ప్రయాణ వసతి, లగ్జరీ డెకరేషన్ వంటి ఖర్చులన్నీ కలిపితే ఈ వివాహానికి కొన్ని కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఖర్చవుతుందని అంచనా. మరోవైపు, నవంబర్ 21న చెన్నైలో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలు అందడం ప్రారంభమయ్యాయి.

4 / 5
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు దేశంలోని పలువురు ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించినట్లు సమాచారం. ఏదేమైనా ఈ ఇయర్ టాలీవుడ్, ఐపీఎల్ , మ్యూజిక్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ వెడ్డింగ్‌గా కావ్య మారన్ - అనిరుధ్ వివాహం నిలవనుంది. కావ్య మారన్ తండ్రి కానిధి మారన్ ప్రముఖ మీడియా దిగ్గజం 'సన్ గ్రూప్'వ్యవస్థాపకుడు , ఛైర్మన్. కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

5 / 5
Follow Us