ఇప్పుడు అదే పాన్లో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కిన తర్వాత, మూడు మధ్యస్థాయి టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలను ఒకసారి కలిపి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. టమాటోలు బాగా ఉడికిన తర్వాత, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకోవాలి. గోంగూర ఆకులు టమాటోలో బాగా కలిసేలా కలుపుతూ, గోంగూర మెత్తబడేంత వరకు ఉడికించాలి.గోంగూర మెత్తబడిన తర్వాత, చిన్న ఉసిరికాయ అంత చింతపండు, పావు టీస్పూన్ పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మూతపెట్టి లో ఫ్లేమ్లో మధ్యమధ్యలో కలుపుతూ గోంగూర పచ్చిదనం పోయి, నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. గోంగూర మిశ్రమం చల్లారే లోపు, పచ్చడికి తాలింపు సిద్ధం చేసుకుందాం. ఒక పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, పావు టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ మినపగుళ్ళు, ఒక టీస్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి.