AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజినీరింగ్ విద్యార్థినులకు PwC స్కాలర్‌షిప్‌.. IIT, NITల్లో చదివే వారికి ఛాన్స్!

గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) ఇండియా ఇంజినీరింగ్‌ విద్యార్థినుల కోసం ‘యాస్పైరింగ్‌ విమెన్‌ లీడర్స్‌ స్కాలర్‌షిప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సాంకేతిక రంగంలో తదుపరి తరం మహిళా నాయకులను ప్రోత్సహించడంతో పాటు, వికసిత భారత్‌ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే..

ఇంజినీరింగ్ విద్యార్థినులకు PwC స్కాలర్‌షిప్‌.. IIT, NITల్లో చదివే వారికి ఛాన్స్!
PwC India Scholarship for Women
Srilakshmi C
|

Updated on: Oct 18, 2026 | 4:56 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 18: గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) ఇండియా ఇంజినీరింగ్‌ విద్యార్థినుల కోసం ‘యాస్పైరింగ్‌ విమెన్‌ లీడర్స్‌ స్కాలర్‌షిప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సాంకేతిక రంగంలో తదుపరి తరం మహిళా నాయకులను ప్రోత్సహించడంతో పాటు, వికసిత భారత్‌ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ ఉపకారవేతనాలను అందించనుంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ లేదా బీఈ చదువుతున్న అర్హులైన విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పుర్‌, ఎన్‌ఐటీ తిరుచిరాపల్లి, బిట్స్‌ పిలానీ, కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ తదితర ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు.

బీటెక్‌ లేదా బీఈ ద్వితీయ సంవత్సరం నుంచి కోర్సు పూర్తయ్యే వరకు అర్హులైన విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు పీడబ్ల్యూసీ ఇండియా వెల్లడించింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా విద్యకు ఆటంకాలు ఎదుర్కొనే విద్యార్థినులకు తోడ్పాటు అందించడంతో పాటు, ఉన్నత విద్యలో రాణించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది. సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రతిభావంతులైన విద్యార్థినులకు అవకాశాలు కల్పించడం ఈ స్కాలర్‌షిప్‌ ప్రధాన ఉద్దేశం. విద్యార్థినులు తమ విద్యను విజయవంతంగా పూర్తి చేసి భవిష్యత్తులో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఈ కార్యక్రమం ప్రోత్సాహాన్నివ్వనుంది.

ఇవి కూడా చదవండి

స్కాలర్‌షిప్‌ మొత్తం, దరఖాస్తు చివరి తేదీ, అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను పీడబ్ల్యూసీ ఇండియా అధికారిక ప్రకటనలో చెక్‌ చేసుకోవాలి.

Follow Us