Ranabaali: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించలేదుగా..
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రణబాలి’. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి. పెళ్లి తర్వాత విరోష్ జంట నటించిన మొదటి సినిమా కావడంతో మొదటి నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. అందుకు తగ్గట్టుగానే దసరా కానుకగా 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణబాలి సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విజయ్-రష్మికల కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో రణబాలి సినిమాకు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. అటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీకి మంచి వసూళ్లే వస్తున్నట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 1878 కాలంలో రాయలసీమను వెంటాడిన కరువు, ప్రజల కష్టాలు, బ్రిటిష్ పాలకు ఆరాచకాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటించడం విశేషం. అలాగే సీనియర్ నటి ఈశ్వరి రావు మరో కీలక పాత్రలో కనిపించారు. అజయ్ అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
రణబాలి సినిమాలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించాడు. సినిమాలో రౌడీ బాయ్ స్క్రీన్ ప్రజెన్స్ అద్బుతంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా మారింది. అదేంటంటే.. రణబాలి సినిమాకు విజయ్ దేవరకొండ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ మదిలో మొదట రామ్ చరణ్ గుర్తుకు వచ్చారట. చరణ్ కు స్టోరీ కూడా వినిపించారట. అయితే అప్పటికే మెగా పవర్ స్టార్ పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారట. దీంతో డైరెక్టర్ రాహుల్ మళ్లీ తనకు అచ్చొచ్చిన హీరో విజయ్ నే ఎంచుకున్నారట. అలా రౌడీ బాయ్ హీరోగా రణబాలి పట్టాలెక్కిందట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడీ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




