AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janakiram Marella : తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా సత్తా చాటిన జానకిరామ్ మారెళ్ల

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కల్యాణ్ ఇటీవలే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. మహిమ నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జానకీరామ్ దర్శకత్వం వహించారు. మౌత్ టాక్ తోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది.

Janakiram Marella : తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా సత్తా చాటిన జానకిరామ్ మారెళ్ల
Janakiram Marella
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2026 | 4:53 PM

Share

టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ అందుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కొందరికే సాధ్యమవుతుంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఈ ఘనత సాధించి, తన ప్రతిభను చాటుకున్నారు. ఈ సినిమాలో ఆయన బలంగా చూపించిన అంశం కామెడీ టైమింగ్. సింపుల్ వన్‌లైనర్స్, సహజమైన సంభాషణలు, సందర్భానుసారంగా వచ్చే కామెడీతో థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించారు. భారీ కామెడీ సన్నివేశాలపై ఆధారపడకుండా, సాధారణ సన్నివేశాలతోనే వినోదాన్ని పంచడంలో సక్సెస్ అయ్యారు.

కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా జానకిరామ్ మారెళ్ల అద్భుతంగా తెరకెక్కించారు. తన గురువు దర్శకుడు బాబీ తరహాలోనే యాక్షన్ సన్నివేశాలను రిచ్‌గా, ఆకట్టుకునే విజువల్స్‌తో రూపొందిస్తూ తనలోని టేకింగ్ స్కిల్‌ను చాటుకున్నారు. కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచుతూనే, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపడం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.

తొలి సినిమాతోనే వినోదానికి పెద్దపీట వేస్తూ, కథను ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానంతో జానకిరామ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంలో తనకున్న పట్టును ప్రూవ్ చేసుకున్నారు. కామెడీ, యాక్షన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ విజయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న జానకిరామ్.. ఇదే టాలెంట్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన సినిమాలతో అలరించే అవకాశం ఉంది. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఇప్పుడు అంచనాలు పెరిగాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us