AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా ఫొటోలు, వీడియోలతో ఏఐ కంటెంట్ క్రియేట్ చేస్తే ఊరుకోను.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్

సోషల్ మీడియా వల్ల ఎంతలాభం ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతుంటారు. ఈ మధ్య ఏఐ పుణ్యమా అని ఫేక్ ఫోటోలు, వీడియోలు ఎక్కువయ్యాయి.

నా ఫొటోలు, వీడియోలతో ఏఐ కంటెంట్ క్రియేట్ చేస్తే ఊరుకోను.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2026 | 4:48 PM

Share

సినీ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఉపయోగించి ఏఐ సాయంతో రకరకాల కంటెంట్ సృష్టించడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా నటీనటుల ముఖాలను ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై పలువురు సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి నేహా శర్మ కూడా ఇదే అంశంపై తీవ్రంగా స్పందించారు. తన అనుమతి లేకుండా ఏఐ టెక్నాలజీతో తన ఫొటోలు, వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తున్న వారికి ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చింది. తన ఫేస్ ఉపయోగించి ఏఐ ఇమేజ్‌లు, వీడియోలు రూపొందించడం ఏమాత్రం కరెక్ట్ కాదని నేహా శర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్‌ (X) ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తన అనుమతి లేకుండా సృష్టించిన కంటెంట్‌ వల్ల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

తన ఫొటోలు లేదా ముఖాన్ని పోలిన చిత్రాలతో ఏఐ వీడియోలు, ఇమేజ్‌లు రూపొందిస్తున్నవారు వెంటనే ఆపేయాలని ఆమె సూచించారు. ఇప్పటికే అలాంటి కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవారు తక్షణమే తొలగించాలని, తన గుర్తింపును ఉపయోగించి కొత్తగా ఎలాంటి ఏఐ కంటెంట్‌ను రూపొందించడం, ఎడిట్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు నేహా. తన ముఖాన్ని ఉపయోగించి తప్పుడు విధంగా చిత్రీకరించడం, తన ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా కంటెంట్‌ను ప్రచారం చేయడం సహించబోనని నేహా శర్మ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

నేహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. చిరుత సినిమా తర్వాత కుర్రాడు అనే సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో టాలీవుడ్ కు దూరం అయ్యింది. అక్కడ వరుసగా కొన్ని సినిమాలు చేసింది.. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు కుర్రాళ్ళ మతిపోతుంది. ఓ రేంజ్ లో అందాలతో ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us