అరెరే ఇన్నాళ్లు తెలీదే.. షాంపూలో ఎక్కువ నురుగ రావడం ఇంత డేంజరా?

18 Oct 2026

Anand T

సాధారణంగా షాంపూలలో నురుగు ఎక్కవగా రావడం కోసం SLS, SLES వంటి సల్ఫేట్ రసాయనాలను కలుపుతారు. కానీ ఇవి దీర్ఘకాలంలో జుట్టుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి.

సల్ఫేట్ షాంపు

అలాగే ఇవి తలపై ఉండే మురికితో పాటు జుట్టుకు అవసరమైన సహజ నూనెలను కూడా తొలగిస్తాయి. దీనివల్ల తల తేమను కోల్పోయి, జుట్టు పొడిగా మారుతుంది.

సహజ నూనెలు

పొడి జుట్టు ఉన్నవారికి ఇవి మరింత డేంజర్. వీళ్లు సల్ఫేట్ కలిసిన షాంపూలను అస్సలు వాడకూడదు. వీటని ఎక్కవగా వాడితే కుదుళ్లలోని సహజ తేమను పోయి జుట్టును మరింత గడ్డిలా మారుస్తుంది.

పొడి జుట్టు

ఈ రసాయనాల వల్ల తల చర్మంపై దురద, మంట లేదా ఎరుపు రంగు దద్దుర్లు రావచ్చు. కాబట్టి సున్నితమైన చర్మం ఉన్నవారికి అస్సలూ వీటిని వాడొద్దు.

దురద, మంట

ఎక్కువ రోజులు సల్ఫేట్ షాంపూలు వాడితే తల చర్మం సహజమైన తేమను పూర్తిగా కోల్పోతుంది.

చుండ్రు పెరుగుతుంది

సల్ఫేట్ రసాయనం జుట్టు బయటి పొరను తెరిచి రంగు కణాలు నీటితో వెళ్లిపోయేలా చేస్తుంది. దీనివల్ల మీరు వేసుకున్న హెయిర్ కలర్ త్వరగా వెలిసిపోతుంది.

హెయిర్ కలర్

జుట్టు తయారయ్యే కెరాటిన్ ప్రోటీన్‌ను సల్ఫేట్లు దెబ్బతీసి కుదుళ్లను బలహీనపరుస్తాయి. దీంతో జుట్టు పల్చబడిపోవడమే కాకుండా, రాలే రేటు పెరిగి మధ్యలోనే విరిగిపోతుంది.

జుట్టు రాలడం

షాంపూ కొనే ముందు బాటిల్ లేబుల్‌పై SLS లేదా SLES అని రాసి ఉందో లేదో చూడండి.నురుగు తక్కువ వచ్చినా సల్ఫేట్-ఫ్రీ షాంపూ వాడటమే జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.

లేబుల్ చెక్