AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!

Fake Food Safety Officials: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ ఐదుగురు మహిళలు దుకాణాలు, బేకరీల్లో తనిఖీలు చేసి ఫైన్లు వేసి డబ్బులు వసూలు చేశారు. మెడలో ఐడీ కార్డులు ధరించి “ఫుడ్ సేఫ్టీ సర్వీసెస్ గుంటూరు” పేరుతో రసీదులు కూడా ఇచ్చినట్లు సమాచారం. పలువురు షాపుదారుల నుంచి డబ్బులు తీసుకుని మహిళలు పరారయ్యారు.

షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!
Fake Food Safety
Nalluri Naresh
| Edited By: |

Updated on: May 17, 2026 | 1:34 PM

Share

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ మహిళలు హల్చల్. ఫుడ్ సేఫ్టీ అధికారులమని చెప్పి దుకాణాలు, బేకరీలలో తనిఖీలు చేసి ఫైన్ వేసి డబ్బులతో ఉడాయించిన మహిళలు.. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హల్చల్ చేశారు. ఐదుగురు మహిళల బృందం మెడలో ఐడీ కార్డులు ధరించి పలు షాపులలో అచ్చం సేఫ్టీ అధికారుల మాదిరే కటింగ్ ఇస్తూ.. అది సరిగా లేదు.. ఇది సరిగా లేదు.. అంటూ హంగామా చేస్తూ అన్ని షాపులకు ఫైన్లు వేశారు. ఫుడ్ సేఫ్టీ సర్వీసెస్ గుంటూరు పేరుతో రసీదులు కూడా ఇచ్చారు. ఇలా పదుల సంఖ్యలో షాపులు తనిఖీ చేసి డబ్బులు వసూలు చేశారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల అతి ప్రవర్తన అనుమానం వచ్చి స్థానికులు ప్రశ్నించడంతో.. తమ పై అధికారులతో మాట్లాడాలంటూ ఫోన్ చేశారు. స్థానికంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తమకు తెలుసని చెప్పడంతో ముఖానికి మాస్క్ కట్టుకొని.. వచ్చిన ఆటోలోనే కళ్యాణదుర్గం వైపు వెళ్ళిపోయారు. స్థానికంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులను షాపు యజమానులు విచారించగా అలాంటి మహిళా బృందం ఎవరు తమ వద్ద లేరని, వారంతా నకిలీ అధికారులని చెప్పడంతో షాప్ యజమానులకు మహిళలు తమను బురిడీ కొట్టించారన్న విషయం అర్థమైంది.

నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులపై అనంతపురం జిల్లా ఫుడ్ సే ఫ్టీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించడంతో షాపు యజమానులు పోలీసులను ఆశ్రయించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఎటువంటి బెరుకు లేకుండా అన్ని షాపులు తనిఖీ చేసి ఇలా డబ్బులు దండుకోవడం బెడుగుప్పలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us