ఆకుకూరలు, కాయగాయలు, పప్పు, నాన్‌వెజ్ వంటకం ఏదైనా సరే.. అందులో టమాటా పడాల్సిందే. ఏ కూర అయినా సరే టమాటా వేస్తే దాని రుచే వేరు. టేస్ట్‌లోనే కాదు ఆరోగ్య పరంగా కూడా ఇది ఎంతో మేలు
TV9 Telugu
టమాటాను డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అడ్డుకుంటుంది. చాలామంది చిన్నవయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు
TV9 Telugu
అలాంటి వారు ప్రతి రోజూ ఒక పచ్చి టమాటాను తింటే చూపు బాగా కనబడుతుంది.టమాటా రంగు చూస్తేనే తినాలనిపిస్తుంది. కూరగాయలన్నింటిలో టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్క టమాటా తీసుకుంటే 10 రకాల కూరగాయలు తిన్నట్లు
TV9 Telugu
టమాటాలో బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉంటుంది. దీంతో చర్మం నిగారిస్తుంది. జుట్టు దృఢంగా ఉంటుంది. అధిక బరువు సమస్య కూడా రాదు
TV9 Telugu
టమాటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తాయి
TV9 Telugu
టమాటా తీసుకుంటే శరీరంలోని 80 శాతం చెడు కొలెస్ట్రాల్ పోతుంది. రక్తపోటు రాకుండా ఉండేందుకు టమాటాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని పొటాషియం రక్తపోటు నివారణకు పనిచేస్తుంది. టమాటాల వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది
TV9 Telugu
అయితే టమాటాల్ని మరీ ఎక్కువగా తింటే, ఎసిడిటీ పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా తేన్పులు, ఛాతీలో నొప్పి ఇబ్బంది పెడతాయి. వీటిల్లో ఉండే పొటాషియం, ఆక్సలేట్ ఈ రెండు పదార్థాలూ కిడ్నీలో రాళ్లను పెంచుతాయి
TV9 Telugu
టమాటాలో సోడియం తక్కువే. కానీ వీటిని సూప్‌గా తీసుకుంటే మాత్రం అధిక మొత్తంలో సోడియం చేరి రక్తపోటును పెంచేస్తుంది