IPL 2026: ఆ 2 జట్ల ఫ్యూచర్ డిసైడ్ చేసే 2 హైఓల్టేజ్ మ్యాచ్‌లు.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్..?
ఈ సూపర్ సండే రోజున జరిగే డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ చిత్రపటాన్ని మార్చనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా ఏ జట్లు ముందడుగు వేస్తాయి, ఏ జట్లు వెనకబడతాయి అనే అంశంపై క్రికెట్ అభిమానులకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Super Sunday Double Header: మొత్తానికి ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు చేరుకోవడంతో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు విజయవంతంగా పూర్తి కాగా, ప్లే ఆఫ్స్ రేసులో నిలవడమే లక్ష్యంగా జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఆదివారం (సూపర్ సండే) అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమైంది. నేడు జరిగే రెండు కీలక మ్యాచ్‌లను ఓసారి చూద్దాం..
పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
మధ్యాహ్నం జరిగే మొదటి పోరులో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పరాజయాల భారంతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావో రేవో లాంటిదే.
ఆర్సీబీ సమీకరణం: ప్రస్తుతం 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉన్న బెంగళూరు, ఈ మ్యాచ్‌లో గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలుస్తుంది. ఒకవేళ ఇక్కడ ఓడినా, తదుపరి మ్యాచ్‌లో గెలిచి ముందడుగు వేసే అవకాశం ఉంది.
పంజాబ్ పరిస్థితి: వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే పంజాబ్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈరోజు ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే.
టాస్: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజరస్ బెంగళూరు జట్లు బ్యాటింగ్ చేయనుంది.
ఇరు జట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(కెప్టెన్/కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్లు: రసిఖ్ సలాం దార్, జోర్డాన్ కాక్స్, అభినందన్ సింగ్, స్వప్నిల్ సింగ్, కనిష్క్ చౌహాన్.
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్, ప్రవీణ్ దుబే
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (రాత్రి 7:30)..
రాత్రి జరిగే రెండో మ్యాచ్‌లో ఫుల్ జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్న రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.
రాజస్థాన్ వ్యూహం: ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకాలని పట్టుదలతో ఉంది.
ఢిల్లీ పట్టుదల: గత మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి మంచి ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లే ఆఫ్ రేసును మరింత ఉత్కంఠగా మార్చాలని చూస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
