తియ్య తియ్యని పైనాపిల్.. షుగర్ ఉన్నవారు తినొచ్చా? లేదా?

Anand T

16 may 2026

పైనాపిల్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. కానీ ఇది అందరిపై ఒకేలాంటి ప్రభావాలను చూపలేదు.

ఆరోగ్య ప్రయోజనాలు

మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పైనాపిల్‌ను అధికంగా తినకూడదు, కానీ చాలా మితంగా తినవచ్చు.

మితంగా తినాలి

మిగతా పళ్లతో పోల్చుతే పైనాపిల్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారుగా 51 నుండి 66 వరకు ఉంటుంది. 

గ్లైసెమిక్ ఇండెక్స్

దీని మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను మరీ వేగంగా కాకుండా, మరీ నిమ్మదిగా కాకుండా మధ్యస్థంగా పెంచుతాయి.

చక్కెర స్థాయిలు

పైనాపిల్‌లో శరీరానికి మేలు చేసే బ్రోమెలైన్ ఎంజైమ్, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

పోషకాల గని

అయితే దీన్ని మితంగా తినడం పెద్ద ప్రమాదం ఏమి కాదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు మాత్రమే తినడం మంచిది.

సురక్షితమైన పరిమాణం

అయితే చాలా మంది పండు కన్నా ఎక్కువగా రసం తాగుతారు. కానీ పైనాపిల్‌ను జ్యూస్ రూపంలో కాకుండా, నేరుగా పండు ముక్కలుగానే తినడం ఉత్తమం.

రసం వద్దు

మధుమేహ బాధితులు పైనాపిల్‌ను తమ ఆహారంలో చేర్చుకునే ముందు ఒకసారి తమ చికిత్స చేసే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

వైద్యుల సలహా