మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
13 October 2025
Prudvi Battula
చాలామంది నలుపు లేదా ముదురు రంగు జీన్స్ వాడుతారు. అవి మొదట స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కానీ కొద్ది రోజులకు వాటి రంగు మారిపోతుంది.
ఉతికినప్పుడు కొన్ని తప్పులు చెయ్యడం వల్ల జీన్స్ రంగు మారుతాయి. ఆ తప్పులను చేయడం మానుకుంటే ఎప్పుడు కొత్తగా ఉంటాయి.
వీటిని ఉతికినపుడు కొన్ని సాధారణ నియమాలను పాటిస్తే, మీ జీన్స్ రంగు మారకుండా ఎక్కువ కాలం కొత్తగా ఉంటాయి.
కొత్త జీన్స్ తొలిసారి ఉతికినప్పుడు సబ్బు వాడకూడదు. దీనిలో రసాయనాలు రంగును మారుస్తాయి. కాబట్టి మొదటి కొన్ని సార్లు సాధారణ నీటితో తడపడం ఉత్తమం.
జీన్స్‌ను ఉతికేటప్పుడు వాటిని లోపలికి తిప్పడం వల్ల రంగు ఎక్కువకాలం నిలుస్తుంది. ఈ చిన్న మార్పు వల్ల రంగు చెడిపోవడం తగ్గుతుంది.
జీన్స్ అరగంట కంటే ఎక్కువసేపు నీటిలో ఉంచితే రంగు వెలిసిపోతుంది. కాబట్టి నానబెట్టే సమయాన్ని తగ్గిస్తే ఉత్తమం.
వేడి నీటిలో జీన్స్ ఉతికితే రంగు త్వరగా నెరిసిపోతుంది. చల్లటి నీటిలో ఉతికితే మంచిది. ఎప్పుడు నీడలో ఆరబెట్టండి.
అలాగే వీటిని ఉతికినప్పుడు ఉప్పు–వెనిగర్ వాడటం వంటి సులభమైన చిట్కాలు పాటిస్తే జీన్స్ ఎప్పుడూ కొత్తగా ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్‌తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?