ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.? 

06 October 2025

Prudvi Battula 

చాలా మంది ఆకర్షణీయంగా కనిపించడానికి తమ ఇళ్ల ముందు కొబ్బరి చెట్లను నాటతారు. కానీ ఇంటి ముందు కొబ్బరి చెట్టు నాటడం మంచిదేనా అనే ప్రశ్న మదిలో ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు కొబ్బరి చెట్టును నాటడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తుంది.

ఒక వ్యక్తి ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఏదైనా సమస్యను ఉంటే ఇంటి పెరట్లో కొబ్బరి చెట్టును నాటితే ప్రతికూలత దూరం అవుతుంది. ఇది దక్షిణ లేదా పడమరలో ఉంచడం మంచిది.

మీరు కష్టపడిన విజయం రాకపోతే కొబ్బరికాయను మీ తలపై 21 సార్లు రుద్దండి. అమ్మవారి ఆలయంలో కొబ్బరిని కాల్చండి.

ప్రతి మంగళ, శనివారాలు ఇలా చేస్తే అన్ని సమస్యల దూరం అవుతాయి. అలాగే వ్యాధుల నుంచి విముక్తి పొంది ఆరోగ్యంగా ఉంటారు.

ఇంట్లో కొబ్బరి నీళ్ళు చల్లితే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. గృహ సమస్యలన్నీ దూరం అవుతాయని పండితులు అంటున్నారు.

ఇంట్లో కొబ్బరి చెట్టు పెంచితే కుటుంబ సంబంధాలు బలంగా మారుతాయి. కుటుంబ సభ్యుల గొడవలు, మనస్పర్థల తొలగిపోతాయి.

కొబ్బరి చెట్టును ఇంట్లో నాటడం వల్ల లక్ష్మి దేవి ప్రవేశిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం, శ్రేయస్సు, శాంతిని పొందుతారు.