70 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా.. నాగ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
17 July 2025
Prudvi Battula
మన్మధుడు.. ఈ పేరు సరిగ్గా షూట్ అయ్యే టాలీవుడ్ హీరో నాగార్జున. 72 ఏళ్ళలో కూడా హ్యాండ్‌సమ్ లుక్ లో అదరగొడుతున్నాడు.
ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకునే అమ్మాయిలకు కొదవలేదు. అలాంటి ఫిట్నెస్ మెయిన్టైన్ చేస్తున్నాడు మరి ఈ సీనియర్ హీరో.
ప్రోబైయటిక్స్తో నాగ్ తన రోజును స్టార్ట్ చేస్తాడు. కిమ్చి, సౌర్‌క్రాట్ వాటితో డే మొదలుపెట్టి వ్యాయామం చేస్తాడు. తరువాత హాట్ వాటర్, కాఫీ తీసుకుంటాడు.
7 గంటలకు ఎగ్ వైట్స్ , బ్రౌన్ బ్రెడ్, 11కి సెకండ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాడు. నాగ్ కి పెసరట్టు అంటే చాలా ఇష్టం.
లంచ్‌లో మాత్రం రైస్ తప్పనిసరి. ఫుడ్ విషయంలో లిమిటేషన్స్ ఏమి లేవు. లంచ్‌లో బిర్యానీ కూడా తీసుకుంటాడు.
ఇక నాగ్ హెల్త్ లో అసలు రహస్యం డిన్నర్.. డిన్నర్ మాత్రం రాత్రి 7 లోపు చేసేస్తాడు. ఇందులో చికెన్, ఫిష్, ఉడకపెట్టిన కూరగాయలు తీసుకుంటాడు.
ఆ తరువాత ఇక ఉదయం వరకు నీళ్లు తప్ప ఏమి తీసుకోడు. దాదాపు 12 గంటలు ఉపవాసం మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాడు.
ఇటీవల నాగ్ ముఖ్య పాత్రలో నటించిన కుబేర బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం 100వ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
విమానంలో ఏ సీటు సురక్షితమైనదో మీకు తెలుసా?
అంతరిక్షంలో అత్యధిక సాటిలైట్లను కలిగిన దేశాలు ఇవే..
పురాణాల ప్రకారం.. అష్టదిక్పాలకులు ఎవరు.?