పురాణాల ప్రకారం.. అష్టదిక్పాలకులు ఎవరు.? 

30 June 2025

Prudvi Battula 

ఇంద్రుడు: ఇంద్రుడిని తూర్పు దిక్కుకు అధిపతిగా భావిస్తారు. ఆయన వాహనం ఐరావతం (తెల్ల ఏనుగు) ఇది రాజ బలానికి చిహ్నం. ఇతని ఆయుధం వాజ్రాయుధం.

వరుణుడు: వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి. అతని వాహనం మకరుడు (మొసలి). వరుణ అస్త్రన్ని ఆయుధంగా చేతపట్టాడు.

కుబేరుడు: కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. కుబేరుని వాహనం గుర్రం. కొన్ని ఆధారాలు మేక వాహనంగా పేర్కొన్నాయి. అతని ఆయుధం ధ్వజం.

యముడు: మృత్యు దేవుడైన యముడిని దక్షిణాది అధిపతిగా భావిస్తారు. అతని వాహనము ఒక దున్నపోతు. ఆయుధంగా దండం ఉపయోగిస్తాడు.

అగ్ని దేవుడు: అగ్ని దేవుడు ఆగ్నేయ దిక్కుకు అధిపతిగా ఉన్నాడు. తగరు (పొట్టేలు) అగ్నిదేవుని వాహనంగా భావిస్తారు. ఆయుధం శక్తి.

నిరృతి: నిరృతి నైరుతి దిక్కుకు అధిపతిగా ఉన్నాడు. అతని వాహనం నరుడు లేదా పురుషుడు. కుంతం అతని ఆయుధంగా ఉంది.

వాయుదేవుడు: వాయుదేవుడు వాయువ్య దిక్కుకు అధిపతు. జింక అతిని వాహనంగా ఉంది. ధ్వజాన్ని ఆయుధంగా ఉపయోగిస్తాడు.

ఈశానుడు: ఈశానుడు (శివుడు) ఈశాన్య దిక్కుకు అధిపతి. వృషభుడు (ఎద్దు) అతని వాహనం. త్రిశులం అతని ఆయుధంగా ఉంది.