మునగాకు ఫ్రై రెసిపీ.. టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా..
22 September 2025
Prudvi Battula
మునగాకు ఫ్రై తయారు చేయడానికి మునగ ఆకులు, చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం, పసుపు పొడి, ఎర్ర కారం పొడి, ఉప్పు, నూనె కావాలి.
ముందుగా కావాల్సిన మునగ ఆకులను బాగా కడిగి కాండం నుండి ఆకులను తీసి చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టె మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేయండి.
ఆ పాన్‌లో తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్‌గా వేయించాలి. తర్వాత వెల్లుల్లి ముక్కలు, తురిమిన అల్లం వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
మీకు కావాలంటే పాన్‌లో పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేయించాలి. తర్వాత తరిగిన మునగ ఆకులను వేసి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వేసి బాగా కలపండి.
పసుపు పొడి, ఎర్ర కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. బాగా కలిపి 5-7 నిమిషాలు ఉడికించాలి. మాడిపోకుండా అప్పుడప్పుడు కలపండి.
మునగ ఆకులు మీకు నచ్చిన విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చాలు రుచికరమైన మునగాకు వేపుడు సిద్ధం అయిపోతుంది.
దీన్ని వేడి వేడిగా అన్నంలో కలుపుకొని ఆస్వాదించండి. అలాగే రోటీతో సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు. దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పితృ పక్షం రోజున ఇలా చేస్తే.. పితృ దోషం నుంచి ఉపశమనం..
ఎండు చేపలు పోషకాల భాండాగారం.. డైట్లో ఉంటే.. అనారోగ్యంపై దండయాత్రే..
విటమిన్ డి సహజంగా పెరగాలంటే ఏం చేయాలి?