విటమిన్ డి సహజంగా పెరగాలంటే ఏం చేయాలి?

17 September 2025

Balaraju Goud 

ఎముకలను బలోపేతం చేయడానికి విటమిన్ డి చాలా ముఖ్యం. విటమిన్ డి సహజంగా ఏవిధంగా పెరుగుతుందో తెలుసుకుందాం.

శరీరంలో విటమిన్ డి మొత్తాన్ని పెంచడానికి సూర్యరశ్మి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ 15 నిమిషాలు సూర్యరశ్మి తీసుకోవాలి.

నువ్వుల నూనె మసాజ్ విటమిన్ డి పెరగడానికి ప్రభావవంతంగా ఉంటుంది. ఇది సూర్యరశ్మిని గ్రహించడంలో సహాయపడుతుంది.

పుట్టగొడుగులు, నల్ల నువ్వులు, దేశీ నెయ్యి వంటివి విటమిన్ డి కి మంచి వనరులు. వాటిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ప్రయోజనకరం.

కొవ్వు చేపలు తినడం వల్ల శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అందుకే వీటి మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

గుడ్డులోని పచ్చసొన కూడా విటమిన్ డికి చాలా మంచి మూలం. దీని వినియోగం విటమిన్ డి లోపాన్ని తీరుస్తుంది.

శాఖాహారులు విటమిన్ డి కోసం ఆల్గే, లైకెన్ ఆధారిత సప్లిమెంట్లను తీసుకోవచ్చు.  అయితే వీటిని తీసుకొనే ముందు డాక్టర్ సలహా ముఖ్యం.

పాలు, పెరుగు, జున్ను, మొక్కల ఆధారిత పాలు కూడా సహజంగా విటమిన్ డిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.