ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ఉష్ణోగ్రతను వేగంగా పెంచుతుంది. ఇది బ్యాటరీ జీవితకాలాన్ని ప్రభావితం చేయవచ్చు.
పదే పదే వేగంగా ఛార్జింగ్ చేయడం వల్ల కాలక్రమేణా బ్యాటరీ సామర్థ్యం తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు.
ఫాస్ట్ ఛార్జింగ్ సర్క్యూట్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్ ఇతర హార్డ్‌వేర్‌లను దెబ్బతీస్తుంది.
సరిగ్గా నిర్వహించకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని ఓవర్ ఛార్జ్ చేయవచ్చు. అధిక వోల్టేజ్, కరెంట్ బ్యాటరీ లోపల ఉన్న రసాయనాలను త్వరగా దెబ్బతీస్తాయి.
నాణ్యత లేని ఫాస్ట్ ఛార్జర్ వల్ల స్మార్ట్‌ఫోన్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీకి నెమ్మదిగా ఛార్జింగ్ చేయడం సురక్షితమైనది. ఎక్కువ కాలం ఉంటుంది.
ప్రారంభంలో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యవంతంగా అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో బ్యాటరీ పనితీరును తగ్గించవచ్చు.
అవసరమైనప్పుడు మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఉపయోగించండి. రోజువారీ సాధారణ ఛార్జింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి.
అయితే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు. వీటికి ఫాస్ట్ చార్జర్ వాడిన పర్వాలేదు.