దోమలు కుట్టడం సహజం. అయితే కొన్ని అధ్యనాల ప్రకారం ఓ బ్లడ్ గ్రూప్‌కి సంబంధించిన వ్యక్తులను మాత్రమే దోమలు ఎక్కువగా కుడతాయని తేలింది.
ఈ అధ్యయనం దోమలు మానవ రక్త గ్రూపులను గుర్తించగలవని, దాని ఆధారంగా వాటి లక్ష్యం ఏంటో ఫిక్స్ చేసుకుంటాయని తెలిపింది.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే దోమలు వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు వస్తాయి.
అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అధ్యయనం ప్రకారం, 'O' రక్త గ్రూప్ దోమలను ఎక్కువగా ఆకర్షిస్తుందని తేలింది.
'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవారు శరీరం నుంచి విడుదలయ్యే రసాయన సంకేతాలు, ముఖ్యంగా గ్లైకోప్రొటీన్‌ను ఎక్కువగా విడుదల అవుతాయి. ఇది దోమలని ఆకర్షణీయంగా ఉంటుంది.
మిగిలిన 'A', 'B', 'AB' గ్రూపులతో పోలిస్తే, 'O' రక్త గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
'O' రక్త గ్రూప్ వారి శరీరం నుంచి రసాయన సంకేతాలు చర్మం, చెమట, శ్వాస ద్వారా విడుదలవుతాయి. ఇది దోమలు ఆకర్షిస్తుంది.
జపాన్‌లో జరిగిన ఈ పరిశోధనాలో వివిధ రక్త గ్రూపుల వారిని దోమల కాటుకు గురిచేసి ప్రవర్తనను గమనించారు. ఫలితంగా, 'O' రక్త గ్రూప్ వారిని దోమలు 83% ఎక్కువగా కొడుతున్నాయి.