మీ బ్రష్ ఇన్ని రోజులకు మార్చితేనే మీ పళ్ళు సేఫ్.. 

06 September 2025

Prudvi Battula 

పళ్ళుపై ఉన్న బ్యాక్టీరియాను తొలగించడానికి రోజుకు రెండుసార్లు ఉదయం ఒకసారి, పడుకునే ముందు మరోసారి బ్రష్ చేయండి.

పళ్ళుపై ఉన్న మొత్తం బ్యాక్టీరియాను పోవాలంటే కనీసం 2 నిమిషాలు మీ దంతాలను బ్రష్ చేయలని నిపుణులు అంటున్నారు.

సున్నితంగా బ్రష్ చెయ్యండి. మీ దంతాలు, చిగుళ్ళు కలిసే ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి శుభ్రంగా బ్రష్ చెయ్యాలి.

మీ చిగుళ్ల మధ్యలో బ్రష్ బాగా రుద్దండి. ఎందుకంటే అక్కడ ఆహారం ఇరుక్కుపోతాయి సులభంగా బయటికి వచ్చేస్తుంది.

ఫ్లోరైడ్ కలిగిన టూత్‌పేస్ట్‌ను వాడండి, ఇది దంతాల ఎనామిల్‌ను బలోపేతం చేయడానిక, క్షయం నిరోధించడానికి సహాయపడుతుంది.

మీ చిగుళ్ళు లేదా పంటి ఎనామిల్‌కు హాని కలిగించని మృదువైన ముళ్ళతో కూడిన టూత్ బ్రష్‌ను ఎంచుకోండి. వీటితో సమస్య ఉండదు.

ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలి. దీని ముందే పాడయినట్లు అనిపిస్తే మాత్రం ముందు మార్చడం మంచిది.

చాలామంది బాగానే ఉంది కదా అని చాలా రోజులు ఒకటే టూత్ బ్రష్‌ను వాడుతూ ఉంటారు. ఇలా చేస్తే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి.