సెప్టెంబర్ నెలలో ఈ రాశులవారికి మహర్దశ.. పట్టిందల్లా బంగారమే.. 

01 September 2025

Prudvi Battula 

సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి శుక్రుని  సంచారం ఉంది. ఇది  శుభ ఫలితాలను తీసుకొస్తుంది. రొమాంటిక్ జీవితాన్ని గడుపుతారు. పెళ్లి కూడా కుదిరే అవకాశం ఉంది.

వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగి వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే బాగా కలిసి వస్తుంది.

కుంభ రాశి వారు సెప్టెంబర్ నెలలో కొత్త అవకాశాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి.

కుంభ రాశి వారు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. పాయసం నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది.

మిధున రాశి వారికి కూడా సెప్టెంబర్ నెల బాగుంది. ఈ రాశి వారు కొత్త బాధ్యతలను చేపడతారు, సానుకూల మార్పులు వస్తాయి.

మిధున రాశి వారికి రిలేషన్షిప్‌లో కూడా బాగుంటుంది. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. వినాయకుడి మంత్రాలు అన్నీ పఠిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి.

కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో మంచి ఫలితాలు ఎదురవుతాయి.  ప్రేమలో విజయాన్ని పొందుతారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి వారికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి సమయం. వారానికి ఒకసారి ఆలయానికి వెళ్తే సానుకూల ఎనర్జీని పొందవచ్చు.