రాత్రి పూట ఎడమ వైపు నిద్రిస్తే.. ఆరోగ్యం మిమ్మల్ని హగ్ చేసుకున్నట్టే..
29 August 2025
Prudvi Battula
జీర్ణాశయం, క్లోమగ్రంథి ఎడమ వైపు ఉంటాయి. ఆ వైపు తిరిగి నిద్రిస్తే గురుత్వాకర్షణ శక్తి వల్ల జీర్ణక్రియ మరింత వేగంగా కొనసాగుతుంది. దీంతో అజీర్తి, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట ఉండవు.
మీకు గ్యాస్ట్రో ఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) సమస్య ఉంటే మాత్రం కచ్చితంగా ఎడమ వైపు తిరిగి నిద్రించాలని వైద్యులు చెబుతుంటారు. దీని వల్ల ఉపశమనం లభిస్తుంది.
ఎడమ వైపు నిద్రిస్తే జీర్ణాశయంలోని ఆమ్లాలు తిరిగి ఆహారనాళంలోకి రాకుండా ఉంటాయి. దీంతో మాటి మాటికీ ఆహారం వల్ల త్రేన్పులు రాకుండా ఉంటాయి.
శరీరంలోని అతిపెద్ద రక్తనాళం అరోటా గుండెకు ఎడమ వైపు ఉన్నందున ఆ వైపున నిద్రిస్తే గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరానికి రక్త సరఫరా మెరుగు పడి గుండెపై భారం తగ్గుతుంది.
గర్భంతో ఉన్న మహిళలు ఎడమ వైపు తిరిగి నిద్రిస్తే గర్భస్థ శిశువు భంగిమ సరిగ్గా ఉంటుంది. శిశువుకు రక్త సరఫరా మెరుగు పడి లివర్‌పై పడే భారం తగ్గుతుంది.
తీవ్రమైన వెన్ను నొప్పి ఉన్న కూడా ఎడమ వైపు నిద్రించాలి. దీనివల్ల వెన్నెముకపై పడే ఒత్తిడి తగ్గి రక్త సరఫరా మెరుగుపడి వెన్ను నొప్పి తగ్గుతుంది.
మాకు కుడివైపు మాత్రమే బాగా అలవాటు ఉంటే సౌకర్యంగా అలానే నిద్రించవచ్చు. దీనివల్ల ఎలాంటి హాని ఉండదు.
కానీ GERD సమస్య ఉన్నవారు, గుండె ఆరోగ్యం కోసం, గర్భిణీలు ఎడమ వైపు తిరిగి నిద్రిస్తేనే మంచిది ఇలాంటి సందర్భాల్లో సౌకర్యం కన్నా ఆరోగ్యమే ముఖ్యం.